TDP Political: ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు కొత్త చర్చకు తెరతీశాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంగా కీలకమైన పుంగనూరులో.. వైసీపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో టీడీపీ అభ్యర్థి నయీమా తాజ్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం కానున్నారు.
మాజీ మంత్రుల ప్రాంతాల్లో టీడీపీ..
ఇక ఆర్కే రోజా ఇలాకా నగరిలోనూ టీడీపీ అభ్యర్థి శ్రీనివాసన్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవమయ్యారు. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో అధికార పార్టీకి మార్గం సుగమమైంది. అంటే.. నిన్న పుంగనూరు.. నేడు నగరి…మాజీ మంత్రుల కీలక రాజకీయ ప్రాంతాల్లో టీడీపీకి ఛైర్మన్ పీఠాలు ఏకగ్రీవం అయ్యాయి.
వైసీపీ కేడర్ లో చర్చ..
ఒకవైపు పుంగనూరులో వైసీపీ పోటీకి దూరం కావడం.. మరోవైపు నగరిలో నామినేషన్ల తిరస్కరణతో టీడీపీ ఏకగ్రీవం కావడం.. ఇప్పుడు వైసీపీ కేడర్‌లో చర్చకు దారితీస్తోంది. మున్సిపల్ ఎన్నికల దగ్గరే పరిస్థితి ఇలా ఉంటే.. ముందున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: రూ. 35,990కే నెక్స్ట్ లెవెల్ స్మార్ట్ టీవీ..ఫుల్ స్పెసిఫికేషన్లు ఇవిగో