CEO Chris Dehring On IND VS WI Revenue: టీమిండియాతో జరుగుతున్న వన్డే, టి20 సిరీస్ ల నేపథ్యంలో తమ వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఒక్క రూపాయి లాభం లేదని కరేబియన్ క్రికెట్ బోర్డు సీఈవో క్రిస్ డెహ్రింగ్ ( CEO Chris Dehring On IND VS WI Revenue) సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ల రెవెన్యూ మోడల్ పైన అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐసీసీ దిక్కుమాలిన రూల్స్ కారణంగా… తమ క్రికెట్ బోర్డుకు ఒక్క రూపాయి రావడం లేదని ఫైర్ అయ్యారు. టీమ్ ఇండియాకు మాత్రం రూ.250 కోట్ల వరకు దక్కుతున్నాయని ఇందులో తమకు కూడా షేరింగ్ కావాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే తమ చిన్న క్రికెట్ బోర్డులు అభివృద్ధి చెందుతాయని, లేకపోతే రోడ్డున పడతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1997 కంటే ముందు ఉన్న రూల్స్ అమలు చేసి, అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ క్రిస్ డెహ్రింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఐసీసీ ప్రస్తుతం అమలు చేస్తున్న రూల్స్ ప్రకారం… ద్వైపాక్షిక సిరీస్ జరిగినప్పుడు ఆ సిరీస్ ప్రసార హక్కులు, టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం హోస్ట్ బోర్డుకే దక్కుతుంది. అంటే భారత పర్యటనకు వెస్టిండీస్ వచ్చి వన్డేలతో పాటు టి20లు ఆడుతోంది. ఈ రెండు సిరీస్ ల ద్వారా రూ.250 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని సమాచారం. ఈ ఆదాయం మొత్తం బీసీసీఐకి చెందుతుంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఒక్క రూపాయి కూడా వెళ్లదన్నమాట. 1997 కంటే ముందు ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహిస్తే పోస్ట్ జట్టు బోర్డుకు 70 శాతం రెవెన్యూ వెళ్ళేది. మిగిలిన 30 శాతం ఆతిథ్య క్రికెట్ బోర్డుకు దక్కేది. కానీ 1997లో ఐసీసీకి సంబంధించిన సభ్య దేశాలు… పాత పద్ధతిని మార్చేశాయి.
అయితే ఆ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పాత పద్ధతిని కొనసాగించాలని పోరాటం చేసింది. కానీ వెస్టిండీస్ జట్టుకు వ్యతిరేకంగా 90 శాతం క్రికెట్ బోర్డులు ఓటు వేశాయి. దీంతో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో క్రిస్ డెహ్రింగ్ అదే విషయాన్ని గుర్తు చేస్తూ… ఎమోషనల్ అయ్యారు. పాత పద్ధతులు అమలు చేసి ఉంటే తమకు రూ.250 కోట్లలో ఎంతో కొంత మొత్తం వచ్చేదని తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డును ఐసీసీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ద్వైపాక్షిక సిరీస్ రూల్స్ మార్చాలని ఐసీసీని రిక్వెస్ట్ చేశారు. మరి దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.