E-Paper
Advertisement

శ్రీవారి భక్తులకు గమనిక.. జనవరి నెల సేవలు, దర్శన టికెట్లు నేటి నుంచి విడుదల, వైకుంఠ ద్వార దర్శనాలు

శ్రీవారి భక్తులకు గమనిక.. జనవరి నెల సేవలు, దర్శన టికెట్లు నేటి నుంచి విడుదల, వైకుంఠ ద్వార దర్శనాలు
Advertisement

Tirumala News: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక. వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల చేస్తోంది టీటీడీ. నేటి నుంచి వాటికి సంబంధించిన షెడ్యూల్ మొదలైంది. సోమవారం నుంచి బుధవారం వరకు ఆర్జిత సేవా టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

శ్రీవారి భక్తులకు గమనిక

జనవరి మాసంలో తిరుమల దర్శనం టికెట్ల దొరకడం చాలా కష్టం. ఎందుకంటే సంక్రాంతి నేపథ్యంలో ఉత్తర ద్వారం నుంచి స్వామిని భక్తులు దర్శించుకుంటారు. వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెలలో జరుగుతాయి. ఈ దర్శనం కోసం భక్తులు ఎగబడతారు. ఆ విధంగా దర్శించుకుంటే కొంతలో కొంతైన ఉపశమనం కలుగుతుందని భక్తుల ప్రగాడ నమ్మకం. తాజాగా జనవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు, దర్శనం, వసతి గదులకు సంబంధించి ఆన్‌లైన్ కోటా విడుదలకు షెడ్యూల్ విడుదల చేసింది టీటీడీ. అక్టోబర్ 19 నుంచి ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జనవరి నెల సేవలు, దర్శన టికెట్లు నేటి నుంచి విడుదల

Advertisement

ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చు. డిప్‌లో టికెట్లు పొందినవారు ఈనెల 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి ఆయా టికెట్లు కేటాయిస్తారు. ఈనెల 22న ఉదయం 10 గంటలకు టీటీడీ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార వంటి సేవల టికెట్లను ఆన్ లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల కానుంది.

అదే రోజు అంటే ఈనెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, వ్యాధులున్నవారు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఇక 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి ప్రాంతాల్లోని వసతి గదులకు సంబంధించిన కోటా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా సేవ‌లు, దర్శన టికెట్లు, వసతి గదులను భక్తులు బుక్ చేసుకోవాల‌ని సూచన చేసింది టీటీడీ.

Advertisement

ALSO READ: కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

Related News

భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి… మహిషాసురమర్ధిని దేవి రూపంలో అమ్మవారు దర్శనం

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

Big Stories

Advertisement
×