E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 19th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తీసుకెళ్లిన నన్స్ ఎవరు..? ఎవరు పంపిస్తే వచ్చారు..?

Nindu Noorella Saavasam Serial Today Episode October 19th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తీసుకెళ్లిన నన్స్ ఎవరు..? ఎవరు పంపిస్తే వచ్చారు..?
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి, నన్స్‌తో కలిసి కోల్‌కతా బయలుదేరే ముందు వైజయంతి వస్తుంది. వైజయంతిని చూసిన మనోహరి చ ఇదీ ఇప్పుడే రావాలా..? అని మనసులో తిట్టుకుంటుంది. వైజయంతి దగ్గరకు వెళ్లి ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి అని అడిగితే.. కోల్‌కతా వెళ్తుంది మేడం.. వాళ్లు కోల్‌కతా నుంచి వచ్చారు. మథర్‌ థెరిస్సా ఆశ్రమం వాళ్లు మనోహరిని తీసుకెళ్తున్నారు అని మిస్సమ్మ చెబితే.. వైజయంతి ఏంటి అమర్‌ ఇది ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌ పూర్తి అయ్యే వరకు మనోహరి ఎక్కడికి వెళ్లకూడదని తెలియదా..?

  అంటే నేను కొంచెం మనోహరి రిలాక్స్ అవుతుంది కదా అని వెళ్లమన్నాను మేడం అని అమర్‌ చెబితే.. మనోహరి పాస్ఫోర్ట్ ఎక్కడుందని అడుగుతుంది. తమతోనే ఉందని మిస్సమ్మ చెబితే ఓ ముందు జాగ్రత్తగా తీసిపెట్టుకునారా..? అని వైజయంతి అడిగితే.. ముందు జాగ్రత్త ఏం లేదు మేడం మనోహరి పాస్‌ఫోర్ట్‌ మా దగ్గరే ఉంటుందని అమర్‌ చెప్తాడు. అప్పుడే నన్‌ మేము కోల్‌కతా వెళ్లడం లేదు మేడం.. ముందుగా ఇక్కడే హైదరాబాద్‌లోని మా ఆశ్రమానికి వెళ్తాము తర్వాత మనోహరిని కోల్‌కతా తీసుకెళ్తాము అని చెప్తారు. ఆ మాటలకు చంభా నువ్వెప్పుడు సగం సగం పనులే చేస్తావా..? అని మనసులో తిట్టుకుంటుంది మనోహరి. యాదమ్మ కూడా మనసులో ఏంటి మనోహరి ఇంత కష్టపడి నాటకం ఆడింది హైదరాబాద్‌లోనే ఉండటానికా..? అనుకుంటుంది.

Advertisement

వైజయంతి మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటే వెళ్లొచ్చు కానీ మీ ఆశ్రమం అడ్రస్‌ ఇచ్చి వెళ్లండి ఇంకో మాట మనోహరి నువ్వు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంక్వైరీకి రావాలి. అలాగే నేను ఎప్పుడనుకుంటే అప్పుడు మీ ఆశ్రమానికి వస్తాను కాబట్టి నాకు చెప్పకుండా నువ్వు సిటీ దాటి ఎక్కడికి వెళ్లొద్దు అంటుంది. నన్‌ సరే అంటూ ఆశ్రమం అడ్రస్‌ ఇస్తుంది. మనోహరి మాత్రం ఇరిటేట్ గా ఫీలవుతూ ఇది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అనుకుంటుంది. తర్వాత నన్‌తో కలిసి కారులో వెళ్తుంది మనోహరి.

కారులో కొద్ది దూరం వెళ్లాక మనోహరి కోపంగా నన్ ను చూస్తుంది. ఒక చోట కారు ఆపమని అడుగుతుంది. ఎందుకని నన్ అడిగితే ఫోన్‌ మాట్లాడాలని చెప్తుంది. అయితే కారులోనే మాట్లాడొచ్చు కదా అని నన్‌ చెబితే.. కొంచెం పర్సనల్‌ ఫోన్‌ మాట్లాడాలి కారు ఆపండి డ్రైవర్‌ కారు పక్కకు ఆపు అంటుంది. నన్‌ కూడా డ్రైవర్‌కు కారు ఆపమని చెప్పగానే కారు ఆపేస్తాడు డ్రైవర్‌. మనోహరి కారు దిగి పక్కకు వెళ్లి కోపంగా చంభాకు కాల్‌ చేస్తుంది. మనోహరి ఫోన్‌ రావడం చూసి చంభా కూడా కోపంగా మనోహరి ఎప్పుడూ సగం సగం పనులే చేస్తుందా..? ఇవాళ మనోహరికి బుద్ది వచ్చేలా తిడతాను అనుకుంటూ కాల్‌ లిఫ్ట్‌ చేస్తుంది.

Advertisement

  మనోహరిని తిడుతుంది. ఎప్పుడూ సగం పనులే చేస్తావా..? ఆ పంపించేదేదో కోల్‌కతా పంపించొచ్చు కదా అంటుంది. అందుకు చంభా కూడా అవును మనోహరి నేను అడుగుతుది అదే ఆ వెల్లేది ఏదో కోల్‌కతా వెళ్లొచ్చు కదా అంటుంది. ఇద్దరు తిట్టుకున్నాక కాసేపటికి ఇద్దరికీ అర్థం అవుతుంది ఆ నన్స్‌ ను పంపించింది తాము కాదని దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. నువ్వు కాక నేను కాక మరెవరు నన్స్‌ను పంపించారు అంటుంది మనోహరి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Big Stories

Advertisement
×