E-Paper
Advertisement

Andhra Pradesh: తిరుమలలో AI విప్లవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భక్తుల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ

Andhra Pradesh: తిరుమలలో AI విప్లవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భక్తుల క్యూ లైన్ల క్రమబద్ధీకరణ
Advertisement

Andhra Pradesh: సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాబోయే టెక్నాలజీలు, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానిపై చర్చించారు. కుటుంబ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఒక్కరోజు అన్నదానానికి అయ్యే వ్యయం రూ.44 లక్షల విరాళాన్ని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు అందించి, కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సంత్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

రూ.25 కోట్ల వ్యయంతో..

తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ ఆహార పదార్థాలను పరీక్షించేలా ల్యాబ్ ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణం పూర్తి చేసింది. శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించబోతున్నామన్నారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీ సాయంతో క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించి, భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కలిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరి నది లో విద్యార్థుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. స్నానం చేసేందుకు ఏడుగురు విద్యార్థులు గోదావరిలోకి దిగారని, వారిలో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు వివరించారు. ఈ ప్రమాదం నుంచి దీపక్, హర్ష ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా..

Advertisement

అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లింది. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతిన్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు అంతా శుభం జరగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలుగు జాతి మరిన్ని విజయాలు సాధించాలన్నారు ఆయన.

Also Read: Romantic Movie OTT: మొగుడికి విడాకులు… వాడుకునే బాయ్ ఫ్రెండ్… కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

పేదలకు ఆర్థిక సాయం

Advertisement

తమ ప్రభుత్వ హయాంలో 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం చంద్రబాబు. ఇక ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. కంజ్యూమర్ జస్టిస్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఓ నివేదిక వచ్చిందని.. వినియోగదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందంజలో ఉందన్నారు. 2047 నాటికి వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీ మారాలంటే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుండాలన్నారు సీఎం. పేదలకు ఆర్థిక సాయం చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై ఉగాది పండుగ రోజున సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఈ సంతకం తో 6787 మందికి ఆర్థిక సాయం అందించేందుకు రూ.55.63 కోట్లు విడుదల అయ్యాయి. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో 1 లక్షా 36 వేల 240 మందికి రూ.1241 కోట్ల ఆర్థిక సాయం అందించారు.

వర్షాకు పంట నష్ట్రం పై..

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు తీవ్రమైన పంట నష్టాన్ని మిగిల్చాయి. దీంతో అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను సీఎంకు వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లింది. 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయారు. అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం తెలిపారు. అకస్మాత్తుగా మారిన వాతావరణం వల్ల రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Also read: Garuda Purana: కలియుగంలో జరిగే ఘోరాల గురించి గరుడపురాణం ఏం చెప్తుందో తెలుసా..?

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×