E-Paper
Advertisement

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!
Advertisement

FSSAI Infant Food Rules: చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల వయసు దాటని పసిపిల్లలకు ఇచ్చే పాలు, ఇతర ఫుడ్ ప్రొడక్ట్స్‌లో పంచదార, ఫ్రక్టోజ్ కలపకూడదని స్పష్టం చేస్తూ ఒక కొత్త ముసాయిదాను సిద్ధం చేసింది. పుట్టిన మొదటి ఆరు నెలలు పిల్లల ఎదుగుదలకు చాలా ముఖ్యం. ఈ సమయంలో వారికి ఇచ్చే ఆహారంలో ఎలాంటి అదనపు తీపి పదార్థాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్లో దొరికే బేబీ ఫుడ్స్‌లో షుగర్ కలపడం వల్ల చిన్న వయసులోనే పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఈ నిబంధనను తీసుకురావడానికి ముందుకొచ్చింది.

తొలి ఆరు నెలలు కీలకం..

పుట్టిన మొదటి ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలతోనే అన్ని పోషకాలు అందుతాయి. అయితే కొన్ని కారణాల వల్ల బయటి ఫుడ్ లేదా ఇతర ప్రత్యామ్నాయాలు వాడాల్సి వస్తుంది. అలా వాడే ఉత్పత్తుల్లో తయారీదారులు రుచి కోసం షుగర్ లేదా ఫ్రక్టోజ్‌ను కలుపుతుంటారు. దీనివల్ల పసిపిల్లలు చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ దశలో కేవలం వయసుకు తగిన పోషకాలు మాత్రమే అందాలని, అనవసరమైన తీపి పదార్థాలను పూర్తిగా నివారించాలని FSSAI భావిస్తోంది. ఇది తల్లిపాల ప్రాముఖ్యతను మరింత పెంచడంతో పాటు, సరైన ఆహారపు అలవాట్లను చిన్ననాటి నుంచే అలవాటు చేయడానికి సహాయపడుతుంది.

Advertisement

Also Read: జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

కొత్త ముసాయిదా రూపకల్పన..

ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. పిల్లల ఆహారంలో లాక్టోజ్, గ్లూకోజ్ పాలిమర్లను వాడుకోవడానికి అనుమతి ఉంది. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరిమితులకు లోబడి సుక్రోజ్, ఫ్రక్టోజ్ జోడించడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త సవరణ ద్వారా ఆరు నెలల లోపు పిల్లల ఫుడ్‌లో సుక్రోజ్, ఫ్రక్టోజ్ కలపడాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 16, 2026 నాడు అధికారిక గెజిట్‌లో ఈ డ్రాఫ్ట్ అమెండ్‌మెంట్‌ను విడుదల చేశారు. దీనివల్ల కంపెనీలు తమ ప్రొడక్ట్స్ తయారీ విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది.

పబ్లిక్ కన్సల్టేషన్ షురూ..

Advertisement

చిన్న వయసులోనే అనవసరమైన చక్కెర పదార్థాలు శరీరంలో చేరడం వల్ల భవిష్యత్తులో చిన్న పిల్లల్లో ఊబకాయం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే FSSAI ఈ ముసాయిదాను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ప్రజల అభిప్రాయాల కోసం ఉంచారు. దీనిపై ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే.. నోటిఫికేషన్ అందిన రోజు నుంచి 60 రోజుల్లోపు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. అందరి నుంచి వచ్చే సూచనలను పరిశీలించిన తర్వాత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ నిబంధనలను ఫైనల్ చేయనుంది. ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో మన దేశంలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Tags

Related News

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

Big Stories

Advertisement
×