Vijayawada Mayor Election: విజయవాడ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. బెజవాడ మేయర్ పీఠంపై కన్నేశారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఈ క్రమంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాయి. ఆయనకు ఇండియా కూటమి మద్దతు పలకడంతో ప్రధాన పార్టీలకు మింగుడుపడడం లేదు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు, ఎవరు, ఏ పార్టీ వైపు ఉంటారో తెలియని పరిస్థితులు నెలకున్నాయి. ఇప్పడు ఏపీలోని ప్రధాన నగరాల మేయర్ పీఠాలపై ప్రజల దృష్టి పడింది. వాటిలో విజయవాడ సిటీ ఒకటి. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును పోటీ చేయాలని ఇండియా కూటమి కోరింది. ఆ పార్టీలు కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. తన నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలని నగర ప్రజలను కోరారు. కొత్త పార్టీ పెడతామని చెప్పిన ఏబీవీ, ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయమని కాంగ్రెస్-కమ్యూనిస్టులు ఆహ్వానం పంపగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చేసేశారు.
విజయవాడ మేయర్ పదవికి మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆదివారం ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏబీకి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు వైసీపీ నుంచి భాగ్యలక్షి, కూటమి నుంచి వంగవీటి రాధ బరిలోకి ఉన్నారు. కూటమి అభ్యర్థి సునాయాశంగా విజయం సాధిస్తారని భావించారు. ఈలోగా ఏబీవీ రంగంలోకి దిగడంతో కొత్త మలుపు తిరిగింది.
ALSO READ: స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?
విజయవాడ సిటీలో కమ్మ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ కమ్యూనిటీకి న్యాయం చేయలేదని సోషల్ మీడియా వేదికగా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏబీ పోటీ చేస్తారన్న వార్త ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన ఎవరి ఓట్లు చీల్చుతారనే టెన్షన్ మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన కమ్మ నేతలు ఆయనకు మద్దతు ఇస్తారా? లేదా అనేది చూడాలి. మొత్తానికి చివరి నిమిషంలో విజయవాడ మేయర్ పోటీ రసవత్తరంగా మారిందనే చెప్పవచ్చు.
1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. విజయవాడ పోలీసు కమిషనర్గా ఆయన రెండుసార్లు పని చేశారు. ఏపీ విడిపోయిన తర్వాత ఆయన ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. ఆ తర్వాత ఏపీ నిఘా విభాగ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. ఆయన సొంతూరు ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాకు చెందినవారు.