Hyderabad City: హైదరాబాద్ సిటీలో ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ వేడుకల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వివిధ ప్రాంతాల మార్గాల దారులు మళ్లించారు. ఆయా ప్రాంతాల వైపు వచ్చే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్లాన్ చేసుకోవాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు అనేది ఇప్పుడు చూద్దాం.
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో భక్తులతో దుర్గాదేవి పందిళ్లు కళకళలాడుతున్నాయి. ఇక హైదరాబాద్ సిటీ గురించి చెప్పనక్కర్లేదు. సద్దుల బతుకమ్మ పండగ కారణంగా హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అక్టోబర్ 18న అనగా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు కారణంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసు అధికారులు.
ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. కూకట్‌పల్లిలోని ఐడిఎల్ వద్ద జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వైపు వాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇవాళ సాయంత్రం ఆంక్షలు విధించారు. హైటెక్ సిటీ, మాదాపూర్, హఫీజ్‌పేట్ నుండి కూకట్పల్లి వై-జంక్షన్ వైపు వాహనదారులను మళ్లించారు. లక్కీ రెస్టారెంట్ సిగ్నల్, కేపీహెచ్‌బీ ఫేజ్ 4, రోడ్ నెం. 1, రెమెడీ హాస్పిటల్ మీదుగా రానున్నాయి.
వాహనాలు రెయిన్బో విస్టాస్, అంజయ్యనగర్ క్రాస్‌రోడ్స్, మూసాపేట్‌లోని వసుంధర ఆసుపత్రి మీదుగా కూకట్పల్లి వై-జంక్షన్‌కు చేరుకోవచ్చు. దీనికితోడు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులు, సిటీ బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేశారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎనిమిది చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచన చేశారు. ట్రాఫిక్ సమాచారం కోసం 9010203626 సంప్రదించాలని పేర్కొన్నారు పోలీసులు.
1. అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ, DBR మిల్స్, ఇందిరా పార్క్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు.
2. ఖైరతాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద ప్రసాద్స్ ఐమాక్స్, మింట్ కాంపౌండ్ రోడ్ వైపు డైవర్ట్ చేశారు.
3. అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ యూ-టర్న్ వైపు మళ్లించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వాహనాలు వెళ్లనున్నాయి.
4. సికింద్రాబాద్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు.. కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్, కవాడిగూడ, గాంధీనగర్, ఇందిరా పార్క్, కట్ట మైసమ్మ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు.
5. నల్లగుంట జంక్షన్ నుంచి బుద్ధ భవన్ వైపు వాహనాలను అనుమతించరు. వాటిని రాణిగంజ్, నెక్లెస్ రోడ్ వైపు వెళ్లనున్నాయి.
6. ముషీరాబాద్ నుంచి చిల్డ్రన్స్ పార్క్, ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను DBR మిల్స్ వద్ద ఇందిరా పార్క్, కట్టమైసమ్మ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు.
7. హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వైపు వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ALSO READ: హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
#HYDTPinfo
🚦Traffic Advisory – Saddula Bathukamma 2026🚦
In view of Saddula Bathukamma celebrations on 18.10.2026 (Sunday) at Bathukamma Ghat, Upper Tank Bund, traffic diversions and restrictions will be in force from 2:00 PM to 11:00 PM around Upper Tank Bund and Necklace… pic.twitter.com/Kzbr4e2T9G— Hyderabad Traffic Police (@HYDTP) October 17, 2026