E-Paper
Advertisement

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?
Advertisement

Chandrababu Naidu: స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. సోషల్ రీ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించామన్న సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో కూటమి నేతలు మిత్ర ధర్మం పాటిస్తూ అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. పార్టీ నుంచి పోటీ చేసే 11 మేయర్ స్థానాలకు 11 సామాజిక వర్గాలకు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక..

చంద్రబాబు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో 2024 ఎన్నికల ఫలితాలకు మించిన స్థాయిలో ఓట్ల శాతం పెరగాలన్నారు. గెలుస్తామన్న ధీమాతో వ్యవహరించ కుండా అంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ఫలితాలు సాధించాల్సిందే. ప్రతీ పంచాయితీని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్పిపల్ ఎన్నికను కూటమి అభ్యర్ధులు గెలిచి తీరాలన్నారు. సోషల్ రీ ఇంజనీరింగ్ ద్వారా సీట్ల కేటాయింపు జరిగింది. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించామని చంద్రబాబు అన్నారు. ప్రజాభిప్రాయం.. కేడర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల ఎంపిక చేపట్టామని అన్నారు.

Advertisement

Also read: ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

11 సామాజిక వర్గాలకు..

ప్రజాభిప్రాయ సేకరణలో 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న వారినే అభ్యర్థులుగా ఎన్నుకున్నామని, కొంత మంది అభ్యర్థిత్వాలపై 80 శాతానికి మించిన మద్దతు లభించిందన్నారు. ప్రజామోదంతో పాటు సోషల్ – రీ ఇంజనీరింగ్ చేశాం. టీడీపీ పోటీ చేసే 11 మేయర్ స్థానాలకు 11 సామాజిక వర్గాలకు ఇచ్చామని, కూటమిగా కలిసి ఐక్యంగా వెళ్లాలన్నారు. కూటమి పార్టీల మనోభావాలను గౌరవించాలి.. మిత్ర ధర్మం పాటించాలన్నారు. పార్టీని బలోపేతం చేయాలి. కూటమిగా మరింత బలపడాలి. ఈ రెండూ ముఖ్యమే. భవిష్యత్తులో నిర్ణయాలకు అనుగుణంగా సమర్ధవంతమైన నేతలు ఎన్నిక కావాలని చంద్రబాబు అన్నారు.

సామరస్యంగా పరిష్రారం..

Advertisement

సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలి. అప్పుడే అన్ని వర్గాలు పార్టీకి అండగా నిలుస్తాయి. సీట్లను దక్కించు కోలేకపోయిన ఆశావహులకు ఈ విషయాన్ని వివరించాలి. శాస్త్రీయంగా ఆలోచన చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకత్వం ఎదిగేందుకు సహకారం అందించాలన్నారు. ఒకటి రెండు చోట్ల వచ్చిన సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించు కుందామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, కూటమి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్దాంమన్నారు. ఈ ఎన్నికల్లో మనం అంతా కలిసి ఐక్యంగా కూటమి విజయాన్ని బలంగా చాటాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోందని అన్నారు. గొడ్డలి పార్టీ చర్యలను గమనిస్తూ ఉండాలి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలిన్నారు.

Also read: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Tags

Related News

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×