Pat Cummins – Marnus Labuschagne: ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా (South Africa vs Australia) మధ్యమార్నస్ లబుషేన్ ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో పూర్తిగా సఫారీలు అధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో కంగారులు కంగారెత్తిపోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) … దిగ్గజ క్రికెటర్ మార్నస్ లబుషేన్ ( Marnus Labuschagne) బ్యాటింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. వీడు చేతకాని దద్దమ్మ అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో హర్ట్ అయిన మార్నస్ లబుషేన్ డ్రెస్సింగ్ రూమ్ లో కన్నీళ్లు పెట్టుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బాధలో ఉన్న మార్నస్ లబుషేన్ ను ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా పట్టించుకోకుండా ఒంటరిగానే వదిలేశారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లో లబుషేన్ అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు. ఇప్పటికే మొదటి టెస్ట్ లో దారుణంగా విఫలమైన మార్నస్ లబుషేన్…. రెండు టెస్టులో కూడా ఆస్ట్రేలియాను నట్టేట ముంచాడు. ఈ క్రమంలో లబుషేన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒకానొక సమయంలో టెస్ట్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా ఎదిగిన లబుషేన్… ఇప్పుడు విఫలం కావడంతో ఆస్ట్రేలియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక నిన్న ఆస్ట్రేలియా ఫాలో ఆడుతున్న క్రమంలో చెత్త షార్ట్ ఆడి పెవిలియన్ కు వెళ్ళాడు. ఈ తరుణంలోనే లబుషేన్ ను విమర్శలు దాడి మరింత పెరిగింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా బ్యాటర్ లబుషేన్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో ఫాలో ఆన్ ఆడుతున్న ఆస్ట్రేలియాను నట్టేట ముంచాడు. కీలక సమయాలలో ఆడాల్సిన లబుషేన్ చేతులెత్తేశాడు. ఈ క్రమంలో లబుషేన్ చెత్త షాట్ లపై పాట్ కమ్మిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీకు బ్యాటింగ్ చేతకాదా ? అంటూ పచ్చి బూతులు తిట్టినట్టు చెబుతున్నారు. అటు ఆస్ట్రేలియా దిగ్గజా కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. లబుషేన్ ఒక చెత్త బ్యాటర్… వాడికి కొంచెం కూడా బుర్ర లేదని ఫైర్ అయ్యాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడట లబుషేన్. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
Marnus Labuschagne 🔥 pic.twitter.com/xelbk61Kzk https://t.co/Rcslx1qNcd
— Kashif (@KashifNdmCric) October 21, 2026