Lalitha Kumari: టైమ్.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఇంతలో రాజాం రోడ్డు పక్కన ఓ బైక్.. కొద్ది దూరంలో ఓ లగేజ్ బ్యాగ్ పక్కనే ఓ మహిళ.. డెడ్‌బాడీ. చూసిన వాళ్లంతా ఏమనుకున్నారో తెలుసా? “అయ్యో.. రోడ్డు ప్రమాదమని! కానీ పోలీసులు అడుగు పెట్టగానే.. సీన్ రివర్స్! ఇది యాక్సిడెంట్ కాదు. మర్డర్! ఇంతకీ ఆమె ఎవరు? విశాఖకు చెందిన లలితకుమారి. చీపురుపల్లిలో JE గా పనిచేస్తున్నారు. ఇంటికి కూతవేటు దూరంలోనే ఆమె ప్రాణం పోయింది!
మరి ఈ పని చేసింది ఎవరు? అక్కడే అసలు ట్విస్ట్! చీపురుపల్లి DSP రాఘవులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్ వాసన పట్టింది.. పరుగు పెట్టింది. చివరికి ఆగింది ఎక్కడ? మృతురాలి భర్త సీతారామరాజు దగ్గర! అంతే.. పోలీసులకు సగం కేసు సాల్వ్! పక్కనే ఉన్న కోనేరులో వెతికితే హత్యకు వాడిన గొడ్డలి బయటపడింది! దానికి తోడు CCTV ఫుటేజ్ క్లూస్ టీమ్ ఆధారాలు.. అన్నీ అతని వైపే వేలెత్తి చూపాయి! అటు కూతురి డెడ్‌బాడీని చూసిన తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. “మా అల్లుడే చంపేశాడు సార్” అంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
అసలు ఇంత ఘోరానికి కారణం ఏంటో తెలుసా? కేవలం అనుమానం! లలిత ఆఫీసులో సహోద్యోగులతో కలిసి పని చేయడం.. భర్తకు నచ్చలేదట. అక్కడి నుంచి మొదలైంది రచ్చ రోజూ గొడవలు.. “చంపేస్తా” అంటూ బెదిరింపులు! అదే మాట చివరికి నిజమైంది! CI నవీన్ కుమార్ ప్రశ్నల ముందు సీతారామరాజు తలవంచాడు. నేరం ఒప్పుకున్నాడు అనుమానం పెనుభూతమైతే.. కట్టుకున్న భార్య ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. 23 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య బంధం గొడ్డలిపోటుతో ముగిసిపోగా.. అటు తల్లిని కోల్పోయి, ఇటు తండ్రి జైలుపాలై ఆ ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు.
Also read: బిఏ కుర్రాడి అద్భుతం.. యూట్యూబ్ చూసి ఎగిరే కారు ఆవిష్కరణ.. యావత్ దేశమే షాక్!