E-Paper
Advertisement

బీరకాయ కోడిగుడ్డు కూర..అన్నం,చపాతీలోకి అద్భుతమైన కాంబినేషన్!

బీరకాయ కోడిగుడ్డు కూర..అన్నం,చపాతీలోకి అద్భుతమైన కాంబినేషన్!
Advertisement

Beerakaya egg curry recipe: బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో.. ఉండే పీచు పదార్థం జీర్ణ శక్తిని మెరుగు పరచడంలో సహాయ పడుతుంది. అయితే.. పిల్లలు సాధారణంగా బీరకాయ అనగానే తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి.. వారి కోసం ఈ కాయ గూరలో కోడిగుడ్డును కలిపి చేసి వండితే ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం అన్నంలోకే కాకుండా చపాతీ, పుల్కాలతో తినడానికి కూడా ఈ కూర అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో.. కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు క్షణాల్లో చేసుకునే ఈ వంటకం గురించి ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

బీరకాయలు – 3

Advertisement

కోడిగుడ్లు – 3

ఉల్లిపాయలు -2 (సన్నగా తరిగినవి)

Advertisement

పచ్చిమిర్చి -3 (చీల్చినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 స్పూన్

కారం -1 స్పూన్

ధనియాల పొడి -1 స్పూన్

పసుపు -చిటికెడు

గరం మసాలా -అర స్పూన్

నూనె -3 స్పూన్లు

పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు)-1 స్పూన్

కరివేపాకు-రెమ్మ

కొత్తిమీర తరుగు-కొద్దిగా

ఉప్పు-రుచికి సరిపడా

తయారీ విధానం :

1.ముందుగా బీరకాయల చెక్కును కొద్దిగా తొలగించి, మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. బీరకాయలో.. సహజంగానే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి..ఉడికేటప్పుడు ఎక్కువ నీళ్లు అవసరం పడదు.

2. స్టవ్ మీద కడాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు,జీలకర్ర, మిన పప్పు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత సన్నగా.. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి చీలికలు, కరివేపాకు..వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లి పాయలు కొద్దిగా మెత్తబడిన.. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.

3.ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కడాయిలో వేయాలి. దీనికి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు చేర్చి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో.. ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. బీరకాయలో.. ఉన్న నీరంతా బయటకు వచ్చి ముక్కలు మెత్తగా ఉడుకుతాయి.

4. బీరకాయ ముక్కలు.. పూర్తిగా మగ్గిన తర్వాత, అందులో కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయి మధ్యలో కొద్దిగా స్థలం చేసుకుని, అందులో.. కోడి గుడ్లను పగలగొట్టి వేయాలి. గుడ్లు కొద్ది సేపు అలాగే ఉంచిన తర్వాత, వాటిని మెత్తగా తిప్పుతూ బీరకాయ కూరతో.. సమానంగా కలపాలి. గుడ్డు పీసులు కూరతో బాగా కలిసి పోయే వరకు రెండు నిమిషాలు వేయించాలి.

5. చివరగా రుచికి సరి పడా ఉప్పు సరి చూసుకొని, అర స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. గుమగుమలాడే రుచికరమైన బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ!

Also Read: నాన్ వెజ్ లవర్స్ కోసం..స్పెషల్ చికెన్ కారం పొడి రెసిపీ

ఆరోగ్య ప్రయోజనాలు:

బీరకాయలోని విటమిన్లు ,కోడిగుడ్డులోని ప్రొటీన్లు ఈ కూర ద్వారా మన శరీరానికి అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారు కూడా డైట్‌లో ఈ కూరను ఈజీగా చేర్చుకోవచ్చు.

ఎంతో సింపుల్ గా, తక్కువ పదార్థాలతో తయారయ్యే ఈ బీరకాయ ఎగ్ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి లేదా సాఫ్ట్ చపాతీలోకి ఇది అద్భుతమైన రుచిని ఇస్తుంది.

Related News

స్ట్రీట్ స్టైల్ ముంతమసాలా..ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేయండి!

ఇల్లు చిన్నదైనా పండుగ కళ రావాల్సిందే.. 1BHKలో దీపావళి డెకరేషన్ కోసం సింపుల్ టిప్స్

రోజూ వాకింగ్ చేస్తున్నారా? మీ నడకలో ఈ ఒక్క అలవాటు మార్చుకోవాలి

మేకప్ తొలగించడానికి ఖరీదైన రిమూవర్లు అవసరం లేదు.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి

వంగినప్పుడు లేదా కొంచెం బరువు ఎత్తగానే వెన్నునొప్పి వస్తోందా? దీనికి కారణాలు ఇవే

హైదరాబాద్ స్టైల్ దమ్ కా కీమా..ఇలా చేస్తే రుచి అద్భుతం!

నాన్ వెజ్ లవర్స్ కోసం..స్పెషల్ చికెన్ కారం పొడి రెసిపీ

Big Stories

Advertisement
×