E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాలకు చల్లటి వాన కబురు, రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు

తెలుగు రాష్ట్రాలకు చల్లటి వాన కబురు, రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు
Advertisement

Weather Updates: రెండు రోజులుగా భానుడి తాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వాన కబురు మోసుకొచ్చింది. ఏపీ, తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో రుతుపవనాలు బంగాళాఖాతం వైపు వేగంగా విస్తరించినట్లు పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు చల్లటి వాన కబురు

Advertisement

రుతుపవనాల కదలికల ప్రభావంతో ఏపీ-తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. వర్షం పడే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కేరళ, కర్ణాటక, అండమాన్ -నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఒడిశా, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది.

Advertisement

రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు-ఐఎండీ

రానున్న మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తాయని పేర్కొంది. తూర్పు-మధ్య బంగాళాఖాతం అంటే.. తీర ప్రాంత ఏపీ వైపు వస్తాయని చెప్పింది. తాజా అంచనాల నేపథ్యంలో మే 26న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని చెప్పకనే చెప్పింది.

నైరుతి రుతుపవనాల వల్ల వర్ష సూచన ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడి తాపం కొనసాగనుందని అంచనా వేసింది. ఉత్తర తెలంగాణలో రాబోయే 3 రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆయా జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ.

ALSO READ: చిల్లర రాజకీయాలు వద్దు.. అభివృద్ధి చేయండి.. ఎంపీ అరవింద్‌పై సంజయ్ ఫైర్!

ఈశాన్య-దక్షిణ రాష్ట్రాలు భారీ వర్షాలకు సిద్ధమవుతున్నప్పటికీ ఉత్తర-మధ్య భారతంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల వీస్తాయని ప్రస్తావించింది. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ వారం వడగాలుల వీచే అవకాశముందని తెలియజేసింది. మే 19 నుంచి 23 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీయనున్నట్లు ఐఎమ్‌డి హెచ్చరించింది.

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×