E-Paper
Advertisement

చిల్లర రాజకీయాలు వద్దు.. అభివృద్ధి చేయండి.. ఎంపీ అరవింద్‌పై సంజయ్ ఫైర్!

చిల్లర రాజకీయాలు వద్దు.. అభివృద్ధి చేయండి.. ఎంపీ అరవింద్‌పై సంజయ్ ఫైర్!
Advertisement

Jagityal Politics: జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే సంజయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మా హక్కులను అడిగితే బిక్షమా?

Advertisement

రాష్ట్రానికి రావాల్సిన నిధులను హక్కుగా అడిగితే అది బిక్షం ఎలా అవుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని ‘బిచ్చగాడు’ అని సంబోధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ స్ఫూర్తితోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడుగుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2 లక్షల కోట్లకు పైగా పన్నుల రూపంలో వెళ్తే, తిరిగి ఇచ్చింది మాత్రం కేవలం రూ. 85 వేల కోట్లేనని లెక్కలు తీశారు. అలాంటప్పుడు కేంద్రం రాష్ట్రాన్ని అడుక్కుంటుందా.. లేక రాష్ట్రం కేంద్రాన్ని అడుక్కుంటుందా? అని నిలదీశారు.

కేంద్రీయ విద్యాలయంపై రాజకీయం వద్దు

Advertisement

జగిత్యాల కేంద్రీయ విద్యాలయం అంశంపై ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్యే గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయం కోసం ఇప్పటికే ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయించామని, దానిని చదును చేసే పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. స్థలం లేదనే సాకుతో విద్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించే కుట్రలు చేయవద్దని హెచ్చరించారు. మక్కల (మొక్కజొన్న) కొనుగోలు విషయంలో కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మతం పేరుతో గెలిచి మాయం అవుతావు.. నీ చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి జగిత్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి’ అంటూ మండిపడ్డారు.

డీఎస్ కొడుకు కాకపోతే నీకు గుర్తింపే లేదు

మరోవైపు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కూడా ఎంపీ అరవింద్‌పై నిప్పులు చెరిగారు. అరవింద్‌కు రాజకీయ బుద్ధి లేదని, డి.శ్రీనివాస్ కొడుకు కాకపోతే ఆయనకు రాజకీయ భవిష్యత్తే ఉండేది కాదని విమర్శించారు. అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి వచ్చారని, కానీ ఒక కిరాయి నాయకుడిలా మాట్లాడుతున్న అరవింద్‌ను బీజేపీ కూడా ఎప్పటికీ గుర్తించదని ధ్వజమెత్తారు. డబ్బులు పెట్టి నన్ను ఓడించే ప్రయత్నం చేసే బదులు.. ఆ పైసలతో సొంతంగా స్థలం కొని కేంద్రీయ విద్యాలయం కట్టించి మీ పేరు పెట్టుకోవాలంటూ అరవింద్‌కు ఘాటు సవాల్ విసిరారు.

Also Read: ఆ కిక్కే వేరు.. వెంటాడుతాం-వేటాడుతాం, సీఎం చంద్రబాబు నోటి వెంట పవన్-ప్రభాస్ డైలాగ్స్

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×