Best Refrigerators: వంటగదికి అవసరమైన అతిముఖ్యమైన వస్తువుల్లో ఫ్రిడ్జ్ ఒకటి. ప్రస్తుత వేసవితో పాటు ఏడాది పొడవునా ఆహార పదార్థాలు తాజాగా ఉండాలన్నా, కూల్ వాటర్ కావాలన్నా ఫ్రిడ్జ్ తప్పనిసరి. అయితే ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బ్రాండ్లు.. వందలాది మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో వాటిలో ఏది కొనాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలో రూ.30,000 బడ్జెట్ లో అద్భుతమైన ఫీచర్లు, ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగి టాప్ – 5 ఫ్రిడ్జ్ లు, వాటి ఫీచర్లు ఇక్కడ అందించడం జరుగుతోంది. ఇందులో మీ అభిరుచి, అవసరానికి తగ్గట్లుగా ఉన్న దానిని ఎంచుకోండి.
శాంసంగ్ కంపెనీకి చెందిన ఈ ఫ్రిడ్జ్.. రూ.30,000 లోపు ధరలో బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. దీనిలోని డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్.. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, శబ్దం లేకుండా పనిచేస్తుంది. ఇందులోని ‘ఆల్ అరౌండ్ కూలింగ్’ ఫ్రిడ్జ్ మొత్తం సమానంగా చల్ల గాలిని ప్రసరింపజేస్తుంది. అంతేకాకుండా విద్యుత్ నిలిచిపోయినప్పుడు హోమ్ ఇన్వర్టర్‌కు ఇది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. 3-4 నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీలకు ఇది సరిగ్గా సరిపోతుంది.
ఫ్రిడ్జ్ ల విభాగంలో ఎల్ జీ బ్రాండ్ కు మంచి గుడ్ విల్ ఉంది. ఈ కంపెనీకి చెందిన ఈ ఫ్రిడ్జ్.. ‘డోర్ కూలింగ్+ (Door Cooling+)’ ఫీచర్ తో పనిచేయనుంది. ఇది సాధారణ ఫ్రిడ్జ్ ల కంటే వేగంగా, మూలమూలలా కూలింగ్‌ను అందిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిలోని ‘స్మార్ట్ డయాగ్నసిస్’ ఫీచర్ ద్వారా ఫ్రిజ్‌లో ఏదైనా సమస్య వస్తే ఫోన్ ద్వారానే గుర్తించవచ్చు. దీని లుక్, ఫినిషింగ్ చాలా ప్రీమియంగా ఉండి కిచెన్‌కు కొత్త అందాన్ని అందిస్తాయి.
వర్ల్‌పూల్ బ్రాండ్ ఎల్లప్పుడూ తక్కువ విద్యుత్ వినియోగం ఎక్కువ కూలింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో ‘6త్ సెన్స్ ఇంటెలిఫ్రెష్ (6th Sense IntelliFresh)’ టెక్నాలజీని అమర్చారు. ఇది ఫ్రిడ్జ్ లోపల ఉన్న లోడ్ ఆధారంగా కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు త్రీ-డోర్ (Triple Door) మోడల్స్ ఇష్టపడితే.. వర్ల్‌పూల్ ప్రొటన్ రాయ్ 240 లీటర్ల మోడల్ ట్రై చేయవచ్చు. కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా తాజాగా ఉంచడంలో వర్ల్‌పూల్ ఫ్రిడ్జ్ లు బెస్ట్ అని చెప్పొచ్చు.
Also Read: ఏసీ రిమోట్ వాడకంపై కన్‌ఫ్యూజన్ ఉందా? ఏ బటన్ ఏం చేస్తుందో ఓ లుక్కేయండి!
హైయర్ కంపెనీకి చెందిన ఈ ఫ్రిడ్జ్ సైతం.. రూ.30 వేల లోపు బడ్జెట్ లో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. హైయర్ ఫ్రిజ్‌లలో ‘ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ’ ఉంటుంది. ఫ్యాన్ మోటార్, కంప్రెసర్ రెండూ ఇన్వర్టర్ నియంత్రణలో పనిచేస్తాయి. ఇందులో 8-ఇన్-1 కన్వర్టిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఫ్రీజర్‌ను కూడా నార్మల్ ఫ్రిజ్‌లా మార్చుకుని స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. కేవలం 49 నిమిషాల్లోనే ఐస్ తయారు చేసే సూపర్ ఫ్రీజ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
Also Read: Blue Star vs Voltas vs Carrier: ఫీచర్లు, ధర, కరెంటు ఆదా.. మధ్యతరగతి ఇంటికి.. మూడింట్లో ఏది బెస్ట్?