Astrology: జ్యోతిష్య శాస్త్రం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం, పురుషులు వారంలోని ఏ రోజున తలస్నానం చేస్తారనే దానిపై శుభ అశుభ ఫలితాలు ఆధారపడి ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. అయితే వారంలో ఆ రోజు తలస్నానం చేస్తే మాత్రం వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారట. అయితే పురుషులకు, స్త్రీలకు ఈ నియమాలు వేర్వేరుగా ఉంటాయట. పురుషులు ఏ రోజు తలస్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం: పురుషులు ఆదివారం తలస్నానం చేయడం వల్ల వారి శరీరలో ఉష్ణం పెరిగిపోయి తాపం కలుగుతుందని శాస్త్రం చెబుతోందట. అంటే మనస్సులో అలజడి లేదా అనవసరమైన చింతలు కలిగే అవకాశం ఉంటుందట.
సోమవారం: సోమవారం తలస్నానం చేయడం వల్ల కాంతి (ముఖ వర్చస్సు) పెరుగుతుందట. మానసిక ప్రశాంతత లభిస్తుందట.
మంగళవారం: మంగళవారం తలస్నానం చేయడం పుత్ర శోకాన్ని లేదా కుటుంబంలో ఇబ్బందులను కలిగిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మంగళవారం పురుషులు తలస్నానం చేయకుండా ఉండటమే మంచిదట.
బుధవారం: బుధవారం తలస్నానం చేయడం అత్యంత శుభప్రదమట. బుధవారం తలస్నానం చేసిన పురుషులకు లక్ష్మీ కటాక్షం, ధన ప్రాప్తి కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఇది చాలా మంచి రోజట.
గురువారం: గురువారం తలస్నానం చేయడం వల్ల ధన నష్టం కలిగే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోందట. ఇది గురువుకు సంబంధించిన రోజు కాబట్టి, ఆ రోజు తలస్నానం చేస్తే పుణ్య ఫలం తగ్గుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
శుక్రవారం: శుక్రవారం తలస్నానం చేయడం వల్ల విపత్తులు లేదా మనసులో భయం కలుగుతాయని పండితులు చెప్తున్నారు.
శనివారం: శనివారం తలస్నానం చేయడం వల్ల సర్వ సుఖాలు లభిస్తాయట. ఆయుష్షు పెరుగుతుందట మరియు శని దోషాలు తగ్గుతాయని పండితులు సూచిస్తున్నారు.
క్లుప్తంగా చెప్పాలంటే సోమవారం, బుధవారం, శనివారం తల స్నానం చేయడానికి చాలా శుభప్రదమైన రోజులట. ఇంక మంగళవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం తలస్నానం చేయకూడని రోజులట.
కొన్ని ప్రత్యేక నియమాలు: ఏదైనా పండగ రోజున, పుట్టినరోజున లేదా గ్రహణం విడిచిన తర్వాత వారంతో సంబంధం లేకుండా తలస్నానం చేయవచ్చట. అయితే అభ్యంగన స్నానం విషయంలో వారం చూసుకోవాలట. శరీరానికి నూనె రాసుకుని చేసే స్నానం (అభ్యంగన స్నానం) కేవలం శనివారం, బుధవారాల్లో చేయడం అత్యంత ఉత్తమట. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నిషిద్ధ రోజుల్లో తలస్నానం చేయాల్సి వస్తే, నీటిలో కొంచెం గడ్డి (దర్భ) లేదా ఆవు నెయ్యి వంటివి వేసుకుని స్నానం చేయడం వల్ల దోషం తగ్గుతుందని పండితులు సూచిస్తున్నారు.
సాధారణంగా చాలా మంది అలవాటు ప్రకారం రోజు మార్చి రోజు తలస్నానం చేస్తుంటాం కానీ మన సంస్కృతిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.