E-Paper
Advertisement

రూ.13,000 లోపు Redmi A7 Pro 5G .. మిడిల్‌క్లాస్ యూజర్లకు ఈ ఫోన్ తెగ నచ్చేస్తుంది!

రూ.13,000 లోపు Redmi A7 Pro 5G .. మిడిల్‌క్లాస్ యూజర్లకు ఈ ఫోన్ తెగ నచ్చేస్తుంది!
Advertisement

Redmi A7 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ మన దేశీ మార్కెట్లోకి సరికొత్త ‘రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ’ ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ A సిరీస్‌లో వస్తున్న మొట్టమొదటి ప్రో మోడల్ ఇదే కావడం విశేషం. సాధారణంగా తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారందరినీ దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది. ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి.. వారికి ఇబ్బంది లేకుండా పెద్ద స్క్రీన్, ఎక్కడా తగ్గని భారీ బ్యాటరీ లాంటి హంగులను ఇందులో జోడించారు. ఈ ఫోన్ చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటూ బ్లాక్, మిస్ట్ బ్లూ, సన్‌సెట్ ఆరెంజ్ వంటి సూపర్ కలర్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఆకట్టుకునేలా డిస్‌ప్లే..

ఈ ఫోన్‌‌ను చూడగానే ముందుగా మనల్ని ఆకట్టుకునేది దీని భారీ 6.9 అంగుళాల డిస్‌ప్లే. అలాగే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 800 నిట్స్ బ్రైట్‌నెస్ వల్ల మండుటెండలో బయట నిలబడి ఫోన్ చూసినా అక్షరాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ‘వెట్ టచ్ 2.0’ అనే టెక్నాలజీ. దీనివల్ల మన చేతులు తడిగా ఉన్నా, కాస్త జిడ్డుగా ఉన్నా సరే స్క్రీన్ ఏమాత్రం తడబడకుండా రెస్పాండ్ అవుతుంది. కళ్ల మీద ఒత్తిడి పడకుండా ఇందులో ప్రత్యేకమైన సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: Meesho బిజినెస్ సీక్రెట్.. అంత తక్కువకే అమ్మడం వెనుకున్న అసలు గుట్టు ఇదే!

48 గంటల బ్యాటరీ బ్యాకప్..

చాలామందికి ఫోన్ కొనేటప్పుడు బ్యాటరీ ఎంతసేపు వస్తుందనే టెన్షన్ ఉంటుంది. ఆ సమస్య రాకుండా రెడ్‌మీ ఇందులో 6300mAh భారీ బ్యాటరీని పెట్టింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. హ్యాపీగా రెండు రోజుల పాటు వాడుకోవచ్చని కంపెనీ ధీమాగా చెబుతోంది. ఇది 15W ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఇందులోని రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా మీ దగ్గర ఉన్న ఇతర చిన్న చిన్న గ్యాడ్జెట్లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 3.0 మీద నడుస్తుంది. గూగుల్ జెమిని వంటి ఏఐ ఫీచర్లు కూడా ఉండటం విశేషం.

కెమెరా విషయానికి వస్తే..

Advertisement

ఇకపోతే ఈ రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 32 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇది హెచ్‌డీఆర్ సపోర్ట్‌తో వస్తుంది కాబట్టి ఫొటోలు చాలా క్లారిటీగా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్ పట్టుకోవడానికి వీలుగా కేవలం 8.15 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ధర 64జీబీ మోడల్ రూ.12,499 కాగా, 128జీబీ మోడల్ రూ.13,499గా ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు ఏప్రిల్ 15 నుండి అమెజాన్, షియోమీ సైట్లలో మొదలవుతాయి. లాంచ్ ఆఫర్ కింద వెయ్యి రూపాయల డిస్కౌంట్ కూడా ఉంది. తక్కువ ధరలో మంచి 5జీ ఫోన్ కావాలనుకునే వారికి ఇది పక్కాగా సెట్ అవుతుంది.

Also Read: ఈ ఫోన్ ఏంట్రా ఇంత ముద్దుగా ఉంది.. Infinix Note 60 Pro వెనుక డిస్‌ప్లే చూస్తే మతిపోతుంది!

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×