Village Deities: గ్రామాలలో వెలిసే దేవత…దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని పిలుస్తారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా – అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే
కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు. ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము
సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.
పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు. పార్వతీదేవియే ఈ గ్రామదేవతలుగా వెలిసిందని చెప్తుంటారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నూటొక్క గ్రామదేవతలు ఉన్నట్లు చెప్తుంటారు.
1.పాగేలమ్మ, 2.ముత్యాలమ్మ, 3 .గంగమ్మ, 4.గంగానమ్మ, 5.బంగారమ్మ, 6.గొంతెమ్మ, 7.సత్తెమ్మ, 8.తాళమ్మ, 9.చింతాలమ్మ, 10.చిత్తారమ్మ, 11.పోలేరమ్మ, 12.మావుళ్లమ్మ, 13.మారెమ్మ, 14.బంగారు బాపనమ్మ, 15.పుట్టానమ్మ, 16.దాక్షాయణమ్మ, 17.పేరంటాలమ్మ, 18.రావులమ్మ, 19.గండిపోచమ్మ, 20.మేగదారమ్మ, 21.ఈరినమ్మ, 22.దుర్గమ్మ, 23.మొదుగులమ్మ, 24.నూకాలమ్మ, 25.మరిడమ్మ, 26.నేరెళ్లమ్మ, 27.పుంతలో ముసలమ్మ, 28.మాచరమ్మోరు, 29.మద్ది ఆనాపా అమ్మోరు, 30.సొమాలమ్మ, 31.పెద్దయింట్లమ్మ, 32.గుర్రాలక్క, 33 .అంబికాలమ్మ, 34.ధనమ్మ, 35.మాలక్షమ్మ, 36.ఇటకాలమ్మ, 37.దానాలమ్మ, 8.రాట్నాలమ్మ, 39.తలుపులమ్మ, 40.పెన్నేరమ్మ, 41.వెంకాయమ్మ, 42.గుణాళమ్మ, 43.ఎల్లమ్మ, 44.పెద్దమ్మ, 45.మాంటాలమ్మ, 46.గంటాలమ్మ, 47.సుంకులమ్మ, 48.జంబులమ్మ, 49.పెరంటాలమ్మ, 50.కంటికలమ్మ, 51.వణువులమ్మ, 52.సుబ్బాలమ్మ, 53.అక్కమ్మ, 54.గనిగమ్మ, 55.ధారాలమ్మ, 56.మహాలక్షమ్మ, 57.లంకాలమ్మ, 58.దోసాలమ్మ, 59.పళ్ళాలమ్మ, 60.అంకాళమ్మ, 61.జోగులమ్మ, 62.పైడితల్లమ్మ, 63.చెంగాళమ్మ, 64.రావులమ్మ, 65.బూరుగులమ్మ, 66.కనకమహాలక్ష్మి, 67.పోలమ్మ, 68.కొండాలమ్మ, 69.వెర్నిమ్మ, 70. దేశిమ్మ, 71.గరవాలమ్మా, 72.గరగలమ్మ, 73.దానెమ్మ, 74.మహాంకాళమ్మ, 75.వేరులమ్మ, 76.మద్దిరావమ్మ, 77.ముళ్ళ మాంబిక, 78.యలారమ్మ, 79.వల్లూరమ్మ, 80.నాగులమ్మ, 81.వేగులమ్మ, 82.ముడియలమ్మ, 83.రేణుకమ్మ, 84.నంగాలమ్మ, 85.చాగాలమ్మ, 86.నాంచారమ్మ, 87.సమ్మక్క, 88.సారలమ్మ, 89.మజ్జిగౌరమ్మ, 90.కన్నమ్మ, 91.రంగమ్మ, 92.వెంగమ్మ, 93.తిరుపతమ్మ, 94.రెడ్డమ్మ, 95.పగడాలమ్మ, 96.మురుగులమ్మ, 97.కుంచమ్మ, 98.ఎరకమ్మ, 99.ఊర్లమ్మతల్లి, 100.మైసమ్మ, 101.సుంకాలమ్మవ్వ
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.