Vastu Shastra: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ద్వారాల (తలుపుల) సంఖ్య ఆ ఇంటి యజమాని ఆర్థిక స్థితిగతులు మరియు కుటుంబ సౌఖ్యంపై ప్రభావం చూపుతుందట. ద్వారాల సంఖ్య విషయంలో ప్రధానంగా పాటించాల్సిన సూత్రం సమ సంఖ్య (Even Numbers) అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంటికి ఉన్న ద్వారాల సంఖ్యను బట్టే ఆ ఇంటి యజమానికి కలిగే ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
2 ద్వారాలు శుభప్రదం: ఇంటికి రెండు గుమ్మాలు ఉంటే చాలా శుభప్రదమట. అలాంటి ఇంట్లో శాంతి, సౌఖ్యం వెల్లివిరుస్తాయట.
4 ద్వారాలు: ఇంటికి నాలుగు గుమ్మాలు ఉంటే ఆ ఇంట్లో నివసించే వాళ్లకు ఆయుష్షు పెరుగుతుందట అదృష్టం వరిస్తుందట.
6 ద్వారాలు: ఏ ఇంటికైతే ఆరు గుమ్మాలు ఉంటాయో ఆ ఇంట్లో నివసించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందట. వారి వంశాభివృద్ధి పెరుగుతుందట.
8 ద్వారాలు: ఎవరి ఇంటికైతే 8 డోర్స్ ఉంటాయో ఆ ఇంట్లో నివసించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట, వారి సంపద రెట్టింపు పెరుగుతుందట.
10 ద్వారాలు: ఏ ఇంటికైతే 10 ద్వారాలు ఉంటాయో ఆ ఇంట్లో నివసించే వారికి చాలా గొప్ప ఫలితాలు ఉంటాయట, వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయట.
12 ద్వారాలు: ఎవరి ఇంటికైతే 12 ద్వారాలు ఉంటాయో వారికి వ్యాపారంలో లాభాలు కలుగుతాయట. వారికి ఉన్నత పదవులు లభిస్తాయట.
ఏ సంఖ్యలు ఉండకూడదు? (నిషిద్ధ సంఖ్యలు): ద్వారాల సంఖ్య ఎప్పుడూ బేసి సంఖ్య (Odd Numbers) లో ఉండకూడదట. అలాగే 10 కి పైన సమ సంఖ్యలు పెరిగినా ఇబ్బంది లేదు కానీ, ఈ క్రింది సంఖ్యలు మాత్రం అస్సలు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుందట. కొన్ని వాస్తు గ్రంథాల ప్రకారం ఇంటికి 10 ద్వారాలు శుభప్రదమే అయినా చివర సున్నాతో ముగిసే సంఖ్యలు (10, 20, 30…) మధ్యస్థ ఫలితాలను ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఇంటి ద్వారాల సంఖ్య 8, 11, 13, 15, 17, 19, 21 అసలు ఉండకూడదట.
ద్వారాల అమరికలో ముఖ్య నియమాలు: కేవలం సంఖ్య మాత్రమే కాదు ద్వారాలు ఎక్కడ ఉన్నాయన్నది కూడా ముఖ్యమేనట. ఇంటి అన్ని ద్వారాల కంటే సింహద్వారం పెద్దదిగా, ఆకర్షణీయంగా ఉండాలట. అలాగే మూడు ద్వారాలు ఒకే సరళరేఖలో (Straight line) ఉండకూడదట. దీనిని శూల అంటారట. ఇది ఇంట్లోని శక్తిని బయటకు పంపేస్తుందట. ఇక ఇంటి మూలల్లో తలుపులు పెట్టకూడదట. గోడకు కనీసం కొన్ని అంగుళాల ఖాళీ వదిలి ద్వారం ఏర్పాటు చేయాలట. అలాగే తలుపులు తీసేటప్పుడు లేదా వేసేటప్పుడు శబ్దం రాకూడదట. ఇది వాస్తు దోషంగా పరిగణించబడుతుందట.
ద్వారాల సంఖ్యను లెక్కించేటప్పుడు కేవలం గదుల ప్రధాన తలుపులను మాత్రమే లెక్కించాలి. పూజ గది తలుపులు, అల్మారా తలుపులు లేదా బాల్కనీ చిన్న తలుపులను ఈ లెక్కలోకి తీసుకోనవసరం లేదని పండితులు సూచిస్తున్నారు. అయితే ఇంటి నుండి బయటకు వెళ్లే ద్వారాలన్నీ లెక్కలోకి వస్తాయట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.