E-Paper
Advertisement

మీకున్న అప్పులు తీర్చి, ధనయోగాన్ని ఇచ్చే  ఆలయం ఎక్కడుందో తెలుసా..?

మీకున్న అప్పులు తీర్చి, ధనయోగాన్ని ఇచ్చే  ఆలయం ఎక్కడుందో తెలుసా..?
Advertisement

Financial temple: మీకున్న అప్పులు తీర్చి మీకు ధనయోగాన్ని ఇచ్చే ఆలయం అది.  ఈ దేశంలోనే ఏ గుడికి లేనటువంటి ఆలయం అది.  అవును ఆ గుడికి వెళ్లిన ఎవరైనా అప్పులు తీరి ధనవంతులు అవుతారట. అయితే అక్కడికి వెళ్లి ఏదో పూజలు చేయాలేమో అనుకోవద్దు అక్కడి దేవుడిని దర్శించుకుంటే చాలట. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది. ఎలా వెళ్లాలి..? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని తామ్రనది తీరాన ఉన్న వైతమానిధి పెరుమాల్‌ ఆలయం ప్రత్యేకత తెలిస్తే ఇప్పుడే పరుగెడుతారు. ఇంతకీ ఆ గుడి ప్రత్యేకత ఏంటో తెలుసా..? మీరు ఎన్ని అప్పుల్లో ఉన్నా సరే ఆ గుడికి వెళ్లి అక్కడి దేవుడిని దర్శనం చేసకుంటే సరి మీ అప్పులన్నీ తీరిపోతాయట. తీరిపోవడమే కాదు.. మీరు కోట్ల కొద్ది ధనం సంపాదిస్తారట. మీ తలరాతనే మారిపోతుందిట. అలాంటి అలాంటి ఆలయం దేశంలో ఎక్కడా లేదంటున్నారు పండితులు. అయితే ఆ ఆలయం విశేషాలు మరిన్ని తెలుసుకుందాం.

Advertisement

కుబేరుడు సంపదను తిరిగి పొందిన చోటు: పురాణాల ప్రకారం, కుబేరుడు ఒకసారి పార్వతీదేవిపై చెడు దృష్టి సారించినందుకు శివుని శాపానికి గురై తన సంపదనంతా కోల్పోతాడట. అప్పుడు కుబేరుడు ఈ క్షేత్రానికి వచ్చి తీవ్రమైన తపస్సు చేయగా, శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై అతనికి తిరిగి నవ నిధులను (సంపదను) ప్రసాదించాడట. అందుకే ఇక్కడ స్వామివారిని వైతమానిధి (అంటే తమిళంలో నిధులను భద్రపరిచేవాడు అని అర్థం వస్తుందట.) అని పిలుస్తారట.

స్వామి వారి విలక్షణమైన భంగిమ: ఈ ఆలయంలో పెరుమాళ్ (విష్ణువు) పవళించిన భంగిమలో (శయన ముద్ర) ఉంటారట. సాధారణంగా విష్ణుమూర్తి ఆదిశేషుడుని తలగడగా చేసుకుంటారు, కానీ ఇక్కడ  మరక్కా (కొలత పాత్ర) ను తలగడగా చేసుకుని ఉంటారట. అలాగే ఆయన తన ఎడమ చేతి అరచేతిని చూస్తున్నట్లుగా ఉంటారట. కుబేరుడికి తిరిగి ఇచ్చిన సంపద సరిగ్గా ఉందో లేదో అని ఆయన పర్యవేక్షిస్తున్నారని భక్తుల నమ్మకమని పండితులు చెప్తున్నారు.
అంగారక (కుజ) గ్రహ దోష నివారణ: నవ తిరుపతులలో ఒక్కో ఆలయం ఒక్కో గ్రహానికి ప్రతీక. వైతమానిధి పెరుమాల్ ఆలయం అంగారక (Mars/కుజ) గ్రహానికి  సంబంధించినది. జాతకంలో కుజ దోషం ఉన్నవారు లేదా అంగారక గ్రహ ప్రభావంతో ఇబ్బందులు పడేవారు ఇక్కడ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు.

Advertisement

మధురకవి ఆళ్వార్ జన్మస్థలం: పన్నెండు మంది ఆళ్వార్లలో ఒకరైన మధురకవి ఆళ్వార్  జన్మించిన పుణ్యస్థలం ఇదే. ఈయన తన గురువైన నమ్మాళ్వార్ పట్ల పరమ భక్తిని చాటుకున్న మహనీయుడట.

ఆర్థిక సమస్యల నుండి విముక్తి: కుబేరుడికే సంపదను తిరిగి ఇచ్చిన స్వామి కావడంతో, ఇక్కడ పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారట. అందుకే చాలా మంది ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేసుకుని వెళ్తుంటారట.

ఆలయ సమయాలు: ఈ ఆలయం ఉదయం: 7:30 నుండి 12:00 వరకు మరియు సాయంత్రం: 5:00 నుండి 8:00 వరకు తెరచి ఉంటుందట. ఈ ఆలయానికి వెళ్లాలనుకుంటే తిరునెల్వేలి లేదా తూత్తుకుడి నుండి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: బుధవారం ఆ పనులు అసలు చేయకూడదట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×