Travelling: మీరు ఏదైనా పని మీద ప్రయాణం చేయాలనుకుంటున్నారా..? అయితే ఆ ఒక్క రోజు మాత్రం ఎలాంటి ప్రయాణం చేయోద్దని సూచిస్తున్నారు పండితులు. ప్రయాణాల విషయంలో వారాలను బట్టి ఫలితాలు ఉంటాయని.. జ్యోతిష్య మరియు సంఖ్యాశాస్త్రం ప్రకారం వారంలో ఏ రోజు ప్రయాణం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం ప్రయాణం చేస్తే కలిగే ఫలితాలు : ఆదివారం ప్రయాణం చేయడం వల్ల ప్రభుత్వ సంబంధిత పనులు లేదా ఉన్నతాధికారులతో జరిపే చర్చలు విజయవంతం అవుతాయట. అలాగే ఆదివారం రోజు తూర్పు దిశ ప్రయాణం చాలా శుభప్రదమట.
సోమవారం ప్రయాణం చేస్తే కలిగే ఫలితాలు : ఇది మనశ్శాంతిని ఇచ్చే ప్రయాణం. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలకు లేదా తీర్థయాత్రలకు ఇది మంచి రోజట. అలాగే సోమవారం రోజు ఉత్తర దిశ ప్రయాణం అనుకూలమట. అయితే వ్యాపార నిర్ణయాల కోసం సోమవారం ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరమట. ఎందుకంటే మనసు చంచలంగా ఉండవచ్చని పండితులు సూచిస్తున్నారు.
మంగళవారం ప్రయాణం చేస్తే కలిగే ఫలితాలు : మంగళవారం ప్రయాణం చేస్తే పనుల్లో ఆటంకాలు లేదా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. సాధ్యమైనంత వరకు మంగళవారం దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిదట. అలాగే మంగళవారం దక్షిణ దిశ ప్రయాణం అంత మంచిది కాదట. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే, కొంచెం బెల్లం తిని బయలుదేరడం శుభప్రదమని సూచిస్తున్నారు.
బుధవారం ప్రయాణం చేస్తే కలిగే ఫలితాలు : బుధవారం ప్రయాణం చేయడం వ్యాపారస్తులకు (Entrepreneurs) అత్యంత అదృష్టకరమైన రోజట. కొత్త డీల్స్ కుదుర్చుకోవడానికి, మార్కెటింగ్ పనులకు మరియు విద్యా సంబంధిత ప్రయాణాలకు ఇది ఉత్తమమైన రోజని చెప్తున్నారు. ఉత్తర మరియు పశ్చిమ దిశ ప్రయాణాలు లాభిస్తాయట.
గురువారం ప్రయాణం చేస్తే కలిగే ఫలితాలు: గురువారం ప్రయాణం విజ్ఞానాన్ని ఇచ్చే ప్రయాణమట. పెద్దలను కలవడానికి, కోర్టు పనులకు లేదా ఆధ్యాత్మిక కార్యాలకు వెళ్ళడానికి ఇది చాలా మంచి రోజట. గురువారం ప్రయాణం వల్ల లాభంతో పాటు గౌరవం లభిస్తుందట. ఇక గురువారం ఉత్తర దిశకు ప్రయాణం చేయడం చాలా శుభప్రదంమని కూడా సూచిస్తున్నారు జ్యోతిష్యులు.
శుక్రవారం ప్రయాణం చేస్తే కలిగే ఫలితాలు: శుక్రవారపు ప్రయాణం సుఖవంతమైన మరియు విలాసవంతమైన ప్రయాణమట. కొత్త వస్తువుల కొనుగోలుకు లేదా వినోదం కోసం చేసే ప్రయాణాలకు ఇది అనుకూలమైన రోజట. అలాగే శుక్రవారం పశ్చిమ దిశ ప్రయాణం చాలా మంచిదట.
శనివారం ప్రయాణం చేస్తే కలిగే ఫలితాలు: శనివారం ప్రయాణాల్లో కొంచెం జాప్యం (Delay) జరిగే అవకాశం ఉందట. పనులు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పూర్తి కావచ్చని.. అయితే ఇనుము, భూమి లేదా యంత్రాలకు సంబంధించిన వ్యాపార ప్రయాణాలు లాభిస్తాయట. శనివారం తూర్పు మరియు ఉత్తర దిశలకు ప్రయాణం చేయడం అంత మంచిది కాదట.
ప్రయాణం చేసేటప్పుడు గమనించవలసిన కొన్ని అంశాలు: ఏ రోజు ప్రయాణించినా, ఆ రోజున ఉన్న రాహుకాలంలో ప్రయాణాన్ని ప్రారంభించకపోవడం మంచిదట. అలాగే ముఖ్యమైన పనుల మీద వెళ్తున్నప్పుడు వర్జ్యం లేని సమయాన్ని చూసుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.