E-Paper
Advertisement

Photos of the deceased: మరణించిన వారి ఫోటోలు ఇంట్లో పెడితే అరిష్టా… అదృష్టమా..?

Photos of the deceased: మరణించిన వారి ఫోటోలు ఇంట్లో పెడితే అరిష్టా… అదృష్టమా..?
Advertisement

Photos of the deceased: మరణించిన వారి ఫోటోలు (పితృదేవతల చిత్రపటాలు) ఇంట్లో ఉంచడం గురించి శాస్త్రాలు మరియు పెద్దలు కొన్ని నిర్దిష్టమైన నియమాలను సూచించారు. వీటిని సరిగ్గా పాటిస్తే అది ఆశీర్వాదం అవుతుందట లేదంటే కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందట.

మరణించిన వారి ఫోటోలు ఇంట్లో ఉంటే అరిష్టమా? అదృష్టమా?: మరణించిన వారు మన పితృదేవతలు. వారి ఫోటోలు ఇంట్లో ఉండటం అరిష్టం కాదు. నిజానికి, వారి ఆశీస్సులు ఉంటేనే వంశాభివృద్ధి, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రం చెబుతోందట. అయితే, వాటిని ఉంచే స్థానం (Direction) మరియు విధానం సరిగ్గా ఉండాలట. లేకపోతే లేనిపోని అరిష్టాలు జరుగుతాయట.

Advertisement

మరణించిన వారి ఫోటోలను ఎక్కడ ఉంచాలి? (సరైన దిశ):  ఇంట్లో మరణించన వారి ఫోటోలను ఎప్పుడూ దక్షిణ దిశ (South) గోడకు తగిలించాలట (అంటే ఫోటోలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉండాలి). మధర్మరాజు మరియు పితృదేవతల నివాసం దక్షిణ దిశ అని నమ్ముతారట. అలాగే ఇంటి నైరుతి మూలలో కూడా ఫోటోలను ఉంచవచ్చట. ఇది ఇంటి యజమానికి స్థిరత్వాన్ని ఇస్తుందట.

మరణించిన వారి ఫోటోలను ఇంట్లో ఎక్కడ ఉంచకూడదు? (ముఖ్యమైన జాగ్రత్తలు): మరణించిన వారి ఫోటోలను ఇంట్లో దేవుళ్ల విగ్రహాలు లేదా ఫోటోలతో పాటు ఉంచకూడదట. దేవుడు వేరు, పితృదేవతలు వేరు. వారిని పూజగదికి కొంచెం దూరంగా లేదా వేరే గోడపై ఉంచడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. ఇక పడక గదిలో లేదా వంటగదిలో మరణించిన వారి ఫోటోలు ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెప్తుందట. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా ఇంటి మధ్యలో ( హాలులో) అందరికీ కనిపించేలా పెద్ద ఫోటోలు కూడా ఉంచకూడదట. ఇంకా మరణించిన వారి ఫోటోలను, ప్రస్తుతం జీవించి ఉన్న వారి ఫోటోలతో కలిపి ఉంచడం లేదా తగిలించడం అస్సలు చేయకూడదట. ఇది జీవించి ఉన్నవారి ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

మరణించిన వారి ఫోటోల స్థితి ఎలా ఉండాలి?: ఫోటోలపై దుమ్ము ధూళి లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలట. ఫోటోలు పాతబడిన, చిరిగిన లేదా గాజు పగిలిన ఫోటోలను ఉంచకూడదట. వాటిని గౌరవంగా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలట. ఇంట్లో కేవలం తల్లిదండ్రులు, తాతముత్తాతల ఫోటోలు మాత్రమే ఉంచాలట. స్నేహితులు లేదా దూరపు బంధువుల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదట.

అలాగే మనల్ని ఈ లోకానికి పంపిన పితృదేవతలను స్మరించుకోవడం అదృష్టమే. వారి ఫోటోలకు ప్రతిరోజూ కాకపోయినా, వారి పుణ్యతిథి నాడు లేదా పండుగ రోజుల్లో పూలమాల వేసి నమస్కరించుకోవడం వల్ల ఇంట్లో శుభం జరుగుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: అలాంటి ఇంట్లో ఏడు తరాల వరకు తిన్నా తరగని సంపద ఉంటుంది..? 

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×