E-Paper
Advertisement

Black thread: కాలికి నల్లదారం కడుతున్నారా..? ఈ తప్పు అసలు చేయకండి

Black thread: కాలికి నల్లదారం కడుతున్నారా..? ఈ తప్పు అసలు చేయకండి

Black thread: చాలా మందికి కాలికి నల్ల దారం కట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఇలా కట్టుకోవడం వల్ల చెడు దృష్టి నుంచి కాపాడతాయని ఎక్కువగా నమ్ముతారు. మన పెద్దలు పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉండడం కోసం ఎక్కువగా కాలికి నల్ల దారం కట్టేవాళ్ళు. నలుపు దారం లేదంటే వెంట్రుకలతో చేసిన దారం కడుతూ ఉంటారు. ఇవి చెడు దృష్టి నుంచి కాపాడుతుందని ఎక్కువగా నమ్ముతారు. అయితే కాలికి నల్లదారం కట్టడం అనేది అసలు మంచి పద్దతి కాదని చెప్తున్నారు పండితులు. దీని వల్ల మన కాలితో మనమే నెగెటివ్‌ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొచ్చినట్లు అవుతుందని అంటున్నారు. ఇంతకీ కాలికి నల్లదారం కడితే ఏమవుతుందో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో చాలా మంది కాలికి నల్లదారం కడుతున్నారు. స్త్రీ, పురుష, చిన్నా పేదా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నారు. ఇలా కాలికి నల్లదారం కట్టుకుంటే.. చెడు దృష్టి నుంచి రక్షణ పొందవచ్చని.. ఏదైనా ప్రతికూల శక్తి ఇబ్బంది పెడుతున్నా ఈ నల్లదారం కట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులు నశించిపోతాయని నమ్ముతుంటారు.. నలుపు రంగు శని గ్రహాన్ని సూచిస్తుందని, శని దేవుడు మనల్ని రక్షిస్తాడని అనుకుంటారు. అయితే ఇలా కాలికి నల్లదారం కట్టడం వల్ల శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారని ఎంత మందికి తెలుసు.. నల్లదారం కాలికి కట్టడం వల్ల ఇంట్లోకి నెగెటివ్‌ ఎనర్జీ వస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్లదారం శనిదేవుడికి ప్రతీక:

నల్లదారం కాలికి కట్టుకుంటే మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదని అంటున్నారు పండితులు.. నల్లదారం కాలికి కట్టుకోవడం వల్ల కాలితో ఎక్కడ పడితే అక్కడ తొక్కుతుంటారు. దీని వల్ల మన ఇంటికి మన ఒంటికి నెగెటివ్‌ ఎనర్జీని ఆహ్వానించినట్టేనని చెప్తున్నారు పండితులు. అలాగే కాలికి నల్లదారం కట్టుకోవడం శనిదేవుడికి అసలు నచ్చదట. నల్లదారం కట్టుకున్న వారిని చూస్తే శనిదేవుడు కోపంతో ఊగిపోతాడని పండితులు హెచ్చరిస్తున్నారు.

నల్లదారం కట్టుకునే సరైన విధానం:

నల్లదారం ఎప్పుడైనా ముంజేతికి లేదా చేతికి కట్టుకోవాలని సూచిస్తున్నారు పండితులు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. మరీ ముఖ్యంగా కాలికి కట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని నమ్ముతారో అంతకంటే ఎక్కువే చేతికి కట్టుకుంటే ఉంటాయిన పండితులు సూచిస్తున్నారు.

నరదిష్టి దూరం: నల్లదారం చేతికి లేదా ముంజేతికి కట్టుకోవడం వల్ల ఆ వ్యక్తిపై ఉన్న నరదిష్టి పోతుందట. దిష్టిదోషం తొలగిపోతుందట.

గ్రహ పీడల విరగడి: నల్ల దారం ఎవరైతే ముంజేతికి లేదా చేతికి కట్టుకుంటారో ఆ వ్యక్తుల మీద ఉన్న గ్రహపీడ మొత్తం తగ్గిపోతుందట. వారికి శనిదేవుడు మంచి చేస్తాడట.

దుష్టశక్తుల తొలగింపు: నల్లదారం చేతికి కట్టుకున్న వ్యక్తి మీద ఏదైనా దుష్టశక్తుల ప్రభావం ఉంటే అదంతా తొలగిపోతుందట. శనీశ్వరుడి దయవల్ల ఆ వ్యక్తికి పాజిటివ్‌ ఆరా అనేది వస్తుందట

ఇంట్లో శాంతి: చేతికి నల్లదారం కట్టుకున్న వ్యక్తి ఇంట్లో ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటుందట. కుటుంబ సబ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుందట.

మనసులో ధైర్యం: నల్లదారం చేతికి కట్టుకుంటే మనసులో ధైర్యం వస్తుందట. ఏదైనా పని చేయడానికి వెనకడుగే వేసే వ్యక్తులు ఇలా నల్లదారం కట్టుకోవడం వల్ల వారు ధైర్యంగా ముందడుగు వేస్తారట.

అయితే ఈ నల్లదారం మహిళలు అయితే తమ ఎడమ చేతికి.. పురుషులు అయితే తమ కుడి చేతికి కట్టుకోవాలని సూచిస్తున్నారు పండితులు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఈ సంవత్సరం మిథున రాశికి మిశ్రమ ఫలితాలు

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×