E-Paper
Advertisement

Shahid Afridi: ఇండియ‌న్ ఫ్యాన్స్ అరుపుల‌కు పాక్ ప్లేయ‌ర్ల కాళ్లు గ‌జ గ‌జ వ‌ణికిపోయాయి

Shahid Afridi: ఇండియ‌న్ ఫ్యాన్స్ అరుపుల‌కు పాక్ ప్లేయ‌ర్ల కాళ్లు గ‌జ గ‌జ వ‌ణికిపోయాయి
Advertisement

Shahid Afridi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  విశ్వ విజేతగా టీమిండియా ( Team India) గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియాను మెచ్చుకుంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో తోపు ఆటగాళ్లు ఉన్నారని.. అందుకే మూడోసారి టైటిల్ గెలిచిందని వెల్లడించారు. అదే సమయంలో 2011 వన్డే వరల్డ్ కప్ ( ICC World Cup 2011) సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi). ఆ సమయంలో ఇండియన్ ఫ్యాన్స్‌ అరుపులకు, తమ పాకిస్తాన్ క్రికెటర్ల కాళ్లు గజ గజ వణికిపోయాయని బాంబు పేల్చారు షాహిద్ ఆఫ్రీది. ఈ దెబ్బకు ఓడిపోయామని వెల్లడించారు.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

పాక్ ప్లేయ‌ర్ల కాళ్లు గ‌జ గ‌జ వ‌ణికిపోయాయి

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన టీమ్ ఇండియా పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) ప్రశంసలు కురిపించారు. ఛాంపియన్ అంటే ఇలా ఉండాలని వెల్లడించారు. ఈ టోర్నమెంట్ మొదటి నుంచి చివరి వరకు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో టీమిండియా టైటిల్ గెల్చుకుందని కొనియాడారు. అదే సమయంలో 2011 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా జరిగిన సంఘటనను కూడా షాహిద్ ఆఫ్రీది గుర్తు చేశారు. ఆ సమయంలో ఇండియన్ ఫాన్స్ అరుపులకు పాకిస్తాన్ ప్లేయర్లకు కాళ్లు గజ గజ ముణికిపోయాయని బాంబు పేల్చారు. 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ సందర్భంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 50 ఓవర్లు ఆడిన టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 260 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ చేతులెత్తేసింది. 49.5 ఓవర్లు ఆడిన పాకిస్తాన్, 231 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఫైనల్ లో శ్రీలంకపై విజయం సాధించి టోర్నమెంట్ కూడా గెలిచింది ఇండియా. అయితే ఈ రెండో సెమీ ఫైనల్ సందర్భంగా మొహాలీలో ఇండియన్ ఫాన్స్ బాగా అరుపులు అరిచారని షాహిద్ ఆఫ్రీది తాజాగా వెల్లడించారు. ఇక వాళ్ల అరుపులకు పాకిస్తాన్ ప్లేయర్ల కాళ్లు గజ గజ వణికిపోయాయని వెల్లడించారు. తాను కూడా వణికిపోయానని షాకింగ్ నిజాలను బయటపెట్టాడు షాహిద్ ఆఫ్రీది. తాము బ్యాటింగ్ చేస్తోన్న క్ర‌మంలో ఇండియ‌న్స్ ఫ్యాన్స్ మ‌రింత అరిచార‌ని, దీంతో ఒత్తిడిలోకి వెళ్లి ఓడిపోయిన‌ట్లు తెలిపారు.

Advertisement

 

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×