E-Paper
Advertisement

Baba Vanga Prediction: 2026లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..? బాబా వంగా ఎం చెప్పారు..?

Baba Vanga Prediction: 2026లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..? బాబా వంగా ఎం చెప్పారు..?
Advertisement

Baba Vanga Prediction: మూడో ప్రపంచ యుద్దం ముంచుకొస్తుందా..? దేశాలకు దేశాలు నాశనం అయిపోతాయా..? న్యూక్లియర్‌ బాంబ్‌లతో భూగోళం దద్దరిల్లనుందా..? అసలు బాబా వంగ ఏం చెప్పారు. ఆమె చెప్పిన భవష్యవాణి ఎంత వరకు నిజమైందిలాంటి ఆసక్తికరమైన విషయాలను,  విస్తుగొలిపే నిజాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

2026లోనే మూడో ప్రపంచ యుద్దం..?:

‘బాల్కన్ల నోస్ట్రడామస్‌’గా పేరొందిన బల్గేరియాకు చెందిన బాబా వంగా జోస్యాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 2026 అంటే ఈ సంవత్సరంలో ప్రపంచం మొత్తం యుద్దాలతో కుదేలవుతుందని దేశాల మధ్య సఖ్యత లోపించి అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని   బాబా వంగ ఎప్పుడో జోతిష్యం చెప్పారని తాజాగా అమెరికాకు చెందిన  వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెలువరించింది. అయితే బాబా వంగ చెప్పిన జోష్యం ఎంత వరకు నిజం అవుతుంది. ఇంతకు ముందు ఆమె చెప్పిన సంఘటనలు ఇప్పటివరకు ఏమైనా జరిగాయా.. లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిజమైన వంగా భవిష్యవాణి:

Advertisement

బాబా వంగా ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పారు. అందులో అతి ముఖ్యమైన కొన్ని సంఘనలు జరిగాయి. అందులో మొదటిది అమెరికా మీద సెప్టెంబర్‌ దాడులు.. పెంటగాన్‌పై తాలిబన్లు జరిపిన దాడి ముఖ్యమైనది. అలాగే ప్రిన్సెస్‌ డయానా మరణ విషయాలను కూడా వంగా చెప్పారు. తాజాగా 2026లో జరగబోయే విషయాలను కూడా వంగా చెప్పినట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో రాసుకొచ్చింది. అందులో అతి ముఖ్యమైనది మూడో ప్రపంచం యుద్దం. అలాగే ఈ సంవత్సరంలోనే మనుషులకు గ్రహాంతర వాసులతో పరిచయం ఏర్పడుతుందని చెప్పినట్టు వాషింగ్టన్‌ పోస్ట్ కథనంలో ఉంది. గ్రహాంతర జీవులతో మానవాళికి ఏర్పడిన పరిచయం ప్రపంచ వ్యాప్త సంక్షోభానికి లేదా వినాశనానికి దారి తీయవచ్చని ఆమె హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆమె మాటలకు బలం చేకూర్చేలా గత నెల భూమికి దగ్గరగా వచ్చిన ‘3I/ATLAS’ అనే ఓ రహస్య వస్తువును దీనికి సంకేతంగా కొందరు సిద్ధాంతకర్తలు భావిస్తున్నారు.

వంగా భవిష్యవాణికి బలం చేకూర్చే సంఘటనలు:

ఇక 2026లోనే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని మానవాళికి అదెంతో ప్రమాదమని ఆమె జోస్యం చెప్పినట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పేర్కోండి. ఆమె జోష్యానికి బలం చేకూర్చేలా  ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా జరుగుతున్న వెనిజువెలా అధ్యక్షుడిని అమెరికా బంధించి తీసుకురావడం. అమెరికా నౌకలను రష్యా చుట్టు ముట్టడం వాటిని సముద్రంలో ముంచేయడం.. అలాగే అమెరికా త్వరలోనే గ్రీన్‌లాండ్‌ను ఆక్రమిస్తానని చెప్పడం. అందుకు నాటో దేశాలు వ్యతిరేకించడం.. చివరికి నాటో అనే కూటమి విచ్చినానికి పునాదులు పడటం.. మరోవైపు అమెరికా ఇరాన్‌ మీద దాడికి సిద్ద మవడం.. ఆ దేశ అంతర్గత వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవడం. అమెరికాను అటు రష్యా, ఇటు చైనా బెదిరించడం.. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్‌ దేశాలు సొంత కరెన్సీ కోసం ప్రయత్నించడం లాంటి విషయాలు మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసే కారణాలుగా పరిశీలకులు చెప్తున్నారు.

నోస్ట్రడామస్ భవిష్యవాణి:

Advertisement

మరోవైపు బాబా వంగా జోస్యంతో పాటే 15వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన అంచనాల ప్రకారం ఈ ఏడాది ఒక ప్రముఖ వ్యక్తి హత్యకు గురయ్యే అవకాశం ఉందని, లేదా ఒక రాజకీయ పాలనను కూల్చే కుట్ర జరగవచ్చని తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది ఏడు నెలల పాటు సాగే ఓ పెద్ద యుద్ధం గురించి కూడా ఆయన తన రచనల్లో హెచ్చరించారు.

ALSO READ: Hindu tradition: ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా..? అసలు శాస్త్రం ఎం చెప్తుందంటే..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×