E-Paper
Advertisement

Electric Mercedes Award: ఎలక్ట్రిక్ మెర్సిడెస్ బెంజ్ కు అరుదైన గుర్తింపు.. యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ గా..

Electric Mercedes Award: ఎలక్ట్రిక్ మెర్సిడెస్ బెంజ్ కు అరుదైన గుర్తింపు.. యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ గా..
Advertisement

European Car of the Year 2026 Award: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కొత్త సంత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించింది. ఈ సంస్థ నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ మెర్సిడెస్ బెంజ్ CLA యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. UKతో సహా యూరోపియన్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు మందగించినప్పటికీ బెంజ్ EV  గత మూడు సంవత్సరాలుగా టాప్ అమ్మకాలతో దూసుకుపోతోంది. తాజాగా బ్రస్సెల్స్ మోటార్ షోలో ఈ అవార్డును ప్రకటించారు. ఈ విభాగంలో మొత్తం ఆరు కార్లు పోటీ పడగా, CLA వాటన్నింటీని వెనక్కి నెట్టి విజయాన్ని దక్కించుకుంది.

సుమారు 50 ఏళ్ల తర్వాత..

ఈ కారు 23 యూరోపియన్ దేశాల నుండి 59 మంది స్వతంత్ర మోటరింగ్ జర్నలిస్టులు సమర్పించిన ఓట్ల ఆధారంగా అవార్డుకు ఎంపిక చేశారు. మెర్సిడెస్ ఫ్యామిలీ కారు జ్యూరీ నుంచి మొత్తం 320 పాయింట్లను పొందింది.  స్కోడా ఎల్రోక్ SUVని 220 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. కియా EV4 మొత్తం EV పోడియంను పూర్తి చేయడానికి 208 పాయింట్లను పొందింది. 50 సంవత్సరాల తర్వాత మెర్సిడెస్ ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది.  చివరి సారిగా 1974లో 450SE S-క్లాస్ ఈ అవార్డును దక్కించుకుంది. .

Advertisement

కొత్త CLA ఫోర్ డోర్ కూపే దాని లాంగ్ రేంజ్ వేరియంట్‌లో ఒక్క చార్జ్ తో 492 మైళ్ల రేంజ్ అందిస్తుంది. ఇది ప్రస్తుతం బ్రిటన్‌లో అమ్మకాల్లో ఉన్న లాంగ్ రేంజ్ ఈవీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.  ఈ కారు 85kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. 10 నిమిషాల ఛార్జ్ తో ఏకంగా 200 మైళ్ల వరకు ప్రయాణిస్తుంది. ఇంకా చెప్పాలంటే కారు ట్యాంక్ లో పెట్రోల్ నింపినంత సేపు ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఈ కాంపాక్ట్ సెలూన్ అద్భుతమైన సామర్థ్యాలు 2026 యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తెచ్చిపెట్టాయి.

ఈ కారు ధర ఎంత అంటే?

CLA గత సంవత్సరం మధ్యకాలం నుంచి £45,615(భారత కరెన్సీలో రూ. 5,520,415) నుంచి అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు స్మార్ట్‌ గా, అత్యంత సౌకర్యవంతమైన మెర్సిడెస్ గా నిపుణులు పిలుస్తున్నారు. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఆపరేటింగ్ సిస్టమ్ (MB.OS)తో వస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఇంటెలిజెంట్ క్లౌడ్‌కి అనుసంధానించబడిన AI మెరుగైన సూపర్ కంప్యూటర్. ఇది క్రమం తప్పకుండా ఓవర్ ది ఎయిర్ అప్ డేట్స్ అందుకుంటుంది. ప్రయాణ సమయంలో యజమానులతో  కమ్యూనికేట్ చేయడానికి, సర్దుబాట్లు చేయడానికి వీలు కల్పిస్తుంది.

Advertisement

కొత్త CLA కోసం ఓపెనింగ్ ఆర్డర్‌లు కంపెనీ అంచనాలను మించిపోయాయని మెర్సిడెస్ వెల్లడించింది. ఆర్డర్ బ్యాంక్ ఇప్పటికే ఈ సంవత్సరం రెండవ సగం వరకు నిండిపోయింది. “కొత్త CLA కార్ ఆఫ్ ది ఇయర్ 2026గా ఎంపికైంది. మెర్సిడెస్ బెంజ్‌కు ఇది గర్వకారణమైన క్షణం”అని మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ AG మేనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మన్ ఓలా కల్లెనియస్ వెల్లడించారు. 2026 యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీ కోసం సిట్రోయెన్ C5 ఎయిర్‌ క్రాస్, డాసియా బిగ్‌స్టర్, ఫియట్ గ్రాండే పాండా, రెనాల్ట్ 4 కార్లు పోటీ పడ్డాయి.

Read Also: KTM RC 160 vs బజాజ్ పల్సర్ RS 200.. స్పెక్స్, మైలేజ్ లో ఏది బెస్ట్ అంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×