E-Paper
Advertisement

Vanga’s 2026 predictions: 2026 ఇంత భయానకంగా ఉంటుందా? బాబా వంగ చెప్పిందే జరుగుతుందా? వామ్మో!

Vanga’s 2026 predictions: 2026 ఇంత భయానకంగా ఉంటుందా? బాబా వంగ చెప్పిందే జరుగుతుందా? వామ్మో!
Advertisement

Vanga’s 2026 predictions: ప్రపంచవ్యాప్తంగా మరోసారి బాబా వంగా పేరు చర్చనీయాంశంగా మారింది. 2026 సంవత్సరాన్ని ఉద్దేశించి ఆమె చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, ఇప్పటివరకు చూడని స్థాయిలో ఆర్థిక పతనం చోటుచేసుకునే అవకాశముందని బాబా వంగా జోస్యం చెప్పిన కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

డిజిటల్ కరెన్సీలపై కూడా దెబ్బ

Advertisement

బ్రిటిష్ మీడియా కథనం ప్రకారం 2026లో గ్లోబల్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయని, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం విస్తరిస్తుందని పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలో అనుకోని మార్పులు, కరెన్సీ విలువల పతనం, ఫిజికల్ కరెన్సీ (నగదు రూపంలో ఉన్న కరెన్సీ)తో పాటు డిజిటల్ కరెన్సీలపై కూడా దెబ్బతీసే ప్రభావం పడే అవకాశం ఉందని ఆ కథనం వెల్లడించింది. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే ప్రపంచ దేశాలు ఎన్నడూ లేని స్థాయిలో ఆర్థిక భారాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Also Read: Apple iPhone 18 Air: ఐఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్.. బరువు తగ్గించి బరిలోకి దిగుతున్న ఐఫోన్ 18 ఎయిర్

Advertisement

సూడో సైన్స్‌ మాత్రమే

ప్రస్తుతం కూడా అనేక దేశాలు ఆర్థిక మాంద్యం, ఎనర్జీ క్రైసిస్, విధానపరమైన అస్థిరతలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 2026లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని కొందరు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, మరికొంతమంది ఆర్థిక వేత్తలు బాబా వంగా పేరుతో ప్రచారంలో ఉన్న ఈ అంచనాలను తోసిపుచ్చుతున్నారు. ఇవి శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలేనని, సూడో సైన్స్‌గా మాత్రమే చూడాలని వారు సూచిస్తున్నారు. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను అంచనా వేయాలంటే డేటా, మార్కెట్ విశ్లేషణలే సరైన మార్గమని పేర్కొన్నారు.

2026లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం

ఇదిలా ఉండగా 2026లో ప్రపంచ దేశాల మధ్య పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉందని కూడా బాబా వంగా జోస్యం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చైనా–తైవాన్ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపైనా నిపుణులు అప్రమత్తంగా ఉండాలని, అధికార వర్గాల అంచనాల పైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా, గతంలో ఆమె చెప్పిన కొన్ని ప్రధాన సంఘటనలు నిజమైన చరిత్ర ఉన్న నేపథ్యంలో, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉంటూ భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×