Sai Krishna Lockup Death: ఏపీ రాష్ట్రంలోని విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి గాదె సాయికృష్ణ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే లాకప్ డెత్ కస్టడీలో మరణించాడని విచారణలో తేలగా. పోలీసులు స్టేషన్‌లో నాకొడుకు సాయికృష్ణను దారుణంగా కొట్టి చంపారని మృతుని తల్లి గాదె విజయలక్ష్మి ఆరోపిస్తూ గత కొన్ని రోజుల నుండి న్యాయం కోసం పోరాడుతున్నారు.
కృష్ణలంక సర్కిల్ సీఐ వి.వి. నాగరాజును ఈ కేసులో అరెస్టు చేసిన విషయం మనందరికి తెసిందే! నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ అయినా సాయికృష్ణకు కర్మకాండల నిర్వహించారు. దీంతో నేడు కుటుంభ సభ్యలు పెద్ద కర్మ చేసారు. అతని బూడిద, మరణించిన తేదీ చెపితే కర్మకాండలు చేసుకుంటామని అనేకమార్లు కుటుంబ సభ్యులు పోలీసులకు అటు ప్రభుత్వానికి చెప్పినా వినిపించుకోకుండా చేశారు.
Also read: Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!
కర్మకాండలు..
దీంతో మరణించిన డేట్, బూడిద లేకుండా కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహించారు. సాయికృష్ణ ఫోటో వద్ద పూలు వేసి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. సాయికృష్ణ పెద్ద కర్మకు అతని పిన్ని అడ్వకేట్ కనకదుర్గ హజరుకాలేదు.
Also read: బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!