Sharmiela mandre :జీవితంలో అత్యంత మధురమైన ఘట్టాన్ని అభిమానులతో ఆలస్యంగా పంచుకోవడం కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. పెళ్లి ఫోటోలతో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు సెలబ్రెటీలు. ఈ క్రమంలోనే కొంతమంది సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకొని, పెళ్లికి సిద్ధమవుతుంటే.. మరికొంతమంది సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు అల్లరి నరేష్ తో సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక హీరోయిన్.. ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకొని ఆ ఫోటోలను ఆలస్యంగా అభిమానులతో పంచుకుంది. ఇక ఆమె ఎవరు? ఆమె ఎవరిని వివాహం చేసుకుంది? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆమె ఎవరో కాదు షర్మిలా మాండ్రే. నటిగా, నిర్మాతగా అలరిస్తూ కన్నడ చిత్రాలలో ఎక్కువగా నటించే ఈమె.. తొలిసారి 2007లో సజ్నీ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. 2010లో వచ్చిన స్వయంవర సినిమా ఈమెకు విమర్శకుల ప్రశంసలు అందించింది. అందంతో, నటనతో ఆకట్టుకున్న ఈమె తొలిసారి తెలుగులో 2013లో అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘కెవ్వు కేక’ అనే చిత్రంతో ఆకట్టుకుంది. అంతేకాదు ఈ చిత్రానికి ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో సైమా అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ, నిర్మిస్తూ బిజీగా మారిన షర్మిల తమిళంలో కూడా హీరోయిన్గా , నిర్మాతగా పలు చిత్రాలకు పనిచేస్తోంది. అయితే ఈమె ఎప్పుడు ప్రేమలో పడిందో తెలియదు కానీ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో రహస్యంగా రిలేషన్షిప్ మైంటైన్ చేసింది.
also read:38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!
ఇప్పుడు సడన్గా జూన్ 28వ తేదీన నిశ్చితార్థం చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చింది. ఈనెల 12వ తేదీన రాజస్థాన్లోని జైపూర్ లో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిగింది. అయితే ఈ ఫోటోలను పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత షర్మిల కాసేపటి క్రితం తన ఇన్స్టా పోస్టులో అధికారికంగా షేర్ చేసింది. ఈ ఫోటోలకు మిస్టర్ అండ్ మిసెస్ సుందరం అని క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం షర్మిల తమిళంలో ఒక సినిమాలో సినిమా చేస్తోంది.
సుధాన్ సుందరం విషయానికి వస్తే..తన ప్యాషన్ స్టూడియోస్ సంస్థలో సినిమాలు నిర్మిస్తున్నారు. అంతేకాదు విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాను కూడా నిర్మించింది ఈయనే. రాధిక కెరియర్ లోనే విభిన్నమైన నటన కనబరచి అబ్బురపరిచిన తాయ్ కిళవి చిత్రాన్ని కూడా ఈయనే నిర్మించారు. ఇక ఈ చిత్రాలతో పాటు జయం రవి – నయనతార కాంబినేషన్లో వచ్చిన ఇరైవన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్, పార్కింగ్, అన్నాబెల్ సేతుపతి, సీతకాతి వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.