E-Paper
Advertisement

peacock feather: నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవచ్చా..?

peacock feather: నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవచ్చా..?
Advertisement

peacock feather: నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవచ్చా..? ఈ డౌట్‌ చాలా మందికి వస్తుంది. అయితే పరిహార శాస్త్రం ప్రకారం నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. నెమలి ఈక ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో మంచి శుభాలు జరుగుతాయని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం: వాస్తు మరియు ఫెంగ్ షుయీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం చాలా శుభప్రదమని నమ్ముతారు. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను (negative energy) తొలగించి, సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

సంపదకు చిహ్నం: నెమలి ఈకలు లక్ష్మీదేవికి ఇష్టమని, వీటిని సంపదకు, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో ఇవి ఒకటి. అందుకే వీటిని ఇంట్లో ఉంచుకుంటే ధనానికి ఎటువంటి లోటు ఉండదని పండితులు సూచిస్తున్నారు. నెమలి ఈకలను  ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుందని తంత్రశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

నెమలి ఈకలు ఇంట్లో ఉంచాల్సిన ప్రదేశాలు (Best Places):

పూజా గది: నెమలి ఈకలను పూజా గదిలో లేదా దేవుని విగ్రహాల దగ్గర ఉంచడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందట. లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి, ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు.

Advertisement

ప్రధాన ద్వారం (Entrance): ఇంటి ప్రవేశ ద్వారం వద్ద నెమలి ఈకలను ఉంచడం వల్ల బయట నుండి వచ్చే ప్రతికూల శక్తులు (Negative Energy) నెమలి ఈకలు అడ్డుకుంటాయని పండితులు చెప్తున్నారు.

లివింగ్ రూమ్ (Living Room): హాలులో వీటిని అలంకరించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామరస్యం పెరుగుతాయట. ఆ ఇంట్లో సుఖసంతోషాలు వెళ్లివిరుస్తాయట.

బీరువా లేదా లాకర్: మీ ఇంట్లో  ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోవడానికి మీ బీరవాలో కానీ మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ నెమలి ఈకలను ఉంచడం చాలా మంచిదని సూచిస్తున్నారు.

చదువుకునే గది: పిల్లలు చదువుకునే గదిలో బల్లపై లేదా వారి పుస్తకాల మధ్య వీటిని ఉంచడం వల్ల వారికి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయట.

పడకగది (Bedroom): బెడ్‌ రూంలో నెమలి ఈకలు పెట్టడం వల్ల  భార్యాభర్తల మధ్య అనుబంధం పెరగడానికి దోహదపడతాయట. ఆ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారట.

నెమలి ఈకలను ఇంట్లో ఏ దిశలో ఉంచాలి

ఈశాన్యం (North-East): ఇంట్లో ఈశాన్యంలో నెమలి ఈకలు పెట్టడం అనేది చాలా మంచిదట. ఇలా ఉంచడం అత్యంత శుభప్రదమైనదిగా పండితులు సూచిస్తున్నారు. ఈశాన్యంలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుందట.

ఆగ్నేయం (South-East): ఆర్థిక వృద్ధి కోసం ఆగ్నేయం దిశలో నెమలి ఈకలు ఉంచడం చాలా మంచిదని తంత్రశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

తూర్పు (East): ఇంట్లో కుటుంబ కలహాలు తగ్గడానికి తూర్పు వైపు గోడకు నెమలి ఈకలు అంటించాలట. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఎటువంటి గొడవలు జరుగవట.

నెమలి ఈక విరిగిపోతే ఏం చేయాలి?:  విరిగిన నెమలి ఈకను తీసేసి, దాని స్థానంలో కొత్తవి పూర్తిస్థాయిలో ఉన్న నెమలి ఈకలను ఉంచాలట. ఒర విరిగిపోయిన నెమలి ఈకను చెత్తలో పడేయకుండా, ఏదైనా పారే నీటిలో (నది లేదా కాలువ) వేయాలట. లేదా మట్టిలో పాతిపెట్టడం మంచి పద్ధతిగా సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: వ్యాపారంలో అభివృద్ధి.. జీవితంలో ఐశ్వర్యం రావాలంటే ఆ చిన్న రెమెడీస్ పాటించాలట – అవేంటో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×