Salil Arora-SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరో ఆరు రోజుల్లో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ జూన్ మొదటి వారం వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐపీఎల్ టోర్నమెంట్ లో ఆడే 10 జట్లు కూడా సంసిద్ధమవుతున్నాయి. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి ఐపీఎల్ జట్లు. అయితే ఇలాంటి నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో డేంజర్ ప్లేయర్ దొరికాడు. నిన్న జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఐదు బంతులు ఆడిన సలీం అరోరా ( SRH Shalil Arora) ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో కాటేరమ్మ కొడుకు దొరికాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) జట్టు ఓనర్ కావ్య మారన్ ( Kavya Maran) కూడా సంబరపడిపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే శనివారం రోజున సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా రాణించారు. ఈ నేపథ్యంలోనే తెరపైకి మరో కాటేరమ్మ కొడుకు వచ్చాడు. అతడే సలీల్ అరోరా. నిన్న జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడు. అంతేకాదు కేవలం 13 బంతుల్లో 40 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లోనే అదరగొట్టిన సలీల్ అరోరాను హైదరాబాద్ అభిమానులు మెచ్చుకుంటున్నారు. తమ జట్టుకు మరో కాటేరమ్మ కొడుకు దొరికాడని పోస్టులు పెడుతున్నారు. కావ్య పాప ఏ ప్లేయర్ ను కొనుగోలు చేసినా, ఆటగాడు అద్భుతంగా రానిస్తాడని.. ఇప్పుడు మరోసారి రుజువు అయిందని పేర్కొంటున్నారు క్రికెట్ అభిమానులు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మరో ఫినిషర్ రోల్ చేసేందుకు సలీల్ అరోరా సిద్ధమవుతున్నాడు. ఇతన్ని మొన్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో 1.50 కోట్లకు కొనుగోలు చేసింది కావ్య పాప. ధర తక్కువ పెట్టినప్పటికీ ఇతడు మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు సలీల్ అరోరా. ఆ టోర్నమెంట్ మొత్తంలో దాదాపు 200 స్ట్రైక్ రేటుతో 350 పరుగులు సాధించాడు. ఇతనిది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్. దేశవాళి క్రికెట్ లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఇతడు, చాలా మ్యాచ్ ల్లో సెంచరీలు నమోదు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మొదటి మినీ వేలంలో సలీల్ అరోరాను కావ్య పాప కొనుగోలు చేసి ఇప్పుడు బరిలో దించుతోంది.
🚨 WHAT A TALENT SALIL ARORA 🚨
In the first innings, Shalil Arora smashed 5 sixes in 5 balls, and when he came out to bat in the second innings, he hit 4 sixes in 4 balls. What a talented player SRH have found their new finisher.🔥🤯 pic.twitter.com/GnA2VVbLSs
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 21, 2026