E-Paper
Advertisement

Simple Remedies: వ్యాపారంలో అభివృద్ధి.. జీవితంలో ఐశ్వర్యం రావాలంటే ఆ చిన్న రెమెడీస్ పాటించాలట – అవేంటో తెలుసా..?

Simple Remedies: వ్యాపారంలో అభివృద్ధి.. జీవితంలో ఐశ్వర్యం రావాలంటే ఆ చిన్న రెమెడీస్ పాటించాలట – అవేంటో తెలుసా..?

Simple Remedies: వ్యాపారంలో అభివృద్ది లేక ఇబ్బందులు పడుతున్నారా..? జీవితంలో ఎంత సంపాదించిన డబ్బు నిలబడక కష్టాలు పడుతున్నారు.. అయితే తంత్రశాస్త్రం ప్రకారం ఆవు దగ్గర కొన్ని రెమెడీస్‌ చేస్తే మీ కష్టాలు తీరిపోయి మీ జీవితంలోకి ఐశ్వర్యం వరదలా దూసుకొకస్తుందట. ఇంతకీ ఆ రెమెడీస్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఆవుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆవుకు కొన్ని దానాలు ఇవ్వడం ద్వారా మనిషి జీవితంలో ఎప్పుడూ చూడని పురోభివృద్ది  చూస్తాడట. అయితే ఆ దానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవుకు నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే ఆధ్యాత్మిక చింత‌న ల‌భిస్తుంద‌ట‌. స‌న్మార్గంలో న‌డ‌వ‌వచ్చ‌ట‌. దైవ చింత‌న పెరుగుతుంద‌ట‌.

మీకు ఎవ‌రైనా శ‌త్రువులు ఉంటే అవు‌ల‌కు దోస‌కాయ‌ల‌ను పెట్టాలట. ఇలా పెట్టడం వల్ల మీకున్న శత్రువుల నివారణ జరుగుతుందట.

ఆవుల‌కు బెండ‌కాయ‌ల‌ను తినిపిస్తే మ‌నోస్థైర్యం పెరుగుతుందట. ఏ ప‌ని చేయ‌డానికైనా కావ‌ల్సినంత ధైర్యం వ‌స్తుందట.

బాగా అప్పులు ఉన్న వారు నాన‌బెట్టిన కందుల‌ను గోమాత‌కు తినిపించాలట. దీంతో రుణ విముక్తి చెందుతారట.

కుటుంబంలో క‌ల‌హాలు ఉన్న వారు, అస్తమానం కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వలు పడుతూ ఉండేవారు గోమాత‌ల‌కు నాన‌బెట్టిన ప‌చ్చి శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే శుభఫ‌లితం ఉంటుందట.

పిల్ల‌లు విద్యారంగంలో ఎద‌గాలంటే వారి త‌ల్లిదండ్రులు గోమాత‌ల‌కు నానబెట్టిన పొట్టు పెస‌ర ప‌ప్పును తినిపించాలని పండితులు సూచిస్తున్నారు.

గోమాత‌కు నాన‌బెట్టిన ఛాయ పెస‌ర‌ప‌ప్పు పెడితే ఇంద్రియ నిగ్ర‌హం క‌లుగుతుందట.

ఉద్యోగం రాకుండా ఉన్న‌వారు, దాని కోసం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారు గోమాత‌కు గోధుమ‌పిండి, బెల్లం క‌లిపి పెట్టాలట. అప్పుడు వారు కోరుకున్న  ఉద్యోగం లభిస్తుందట.

ధ‌నం బాగా సంపాదించాల‌నుకునే వారు గోమాత‌కు మిన‌ప‌పిండి, బెల్లం క‌లిపి పెట్టాలట. దీంతో వాళ్లు అనుకున్న దానికన్నా ఎక్కువే సంపాదిస్తారట.

మాన‌సిక ప్ర‌శాంత‌త కావాల‌నుకునే వారు గోమాత‌కు దొండ‌కాయ‌లు పెట్టాలట.

గోమాత‌కు అర‌టి పండ్లు తినిపిస్తే ఉన్న‌త ప‌ద‌వి లభిస్తుందట.

సంతానం కోసం వేచి చూస్తున్న వారు.. ఎన్నో ఏళ్లుగా సంతానం కలగని వారు  గోమాత‌కు వంకాయ‌ల‌ను తినిపిస్తే సంతాన భాగ్యం కలుగుతుందట.

వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు గోమాత‌కు క్యారెట్ల‌ను పెట్టాలట.

న‌ర ఘోష ఎక్కువగా ఉన్న వారు గోమాత‌కు బంగాళా దుంప‌ల‌ను తినిపిస్తే వారిపై ఉన్న నరగోష పోతుందట.

వివాహం కాని వారు గోమాత‌కు ట‌మాటాల‌ను పెడితే త్వరలోనే వివాహం అవుతుందట.

గోమాత‌కు బీట్ రూట్‌, పాల‌కూర తినిపించినా త్వరలోనే ధ‌నవంతులు అవుతారు. వారికి అఖండ ఐశ్వ‌ర్య ప్రాప్తి క‌లుగుతుందట.

గోమాత‌కు నాన‌బెట్టిన మినుములు పెడితే ఆత్మ విశ్వాసం పెరుగుతుందట.

గోమాత‌కు నానబెట్టిన కందులు పెడితే ఎక్కువ కోప స్వభావం తగ్గుతుందట.

తోట కూర‌, బెల్లం క‌లిపి గోమాత‌కు పెట్టినా మాన‌సిక ప్రశాంత‌త లభిస్తుందట.

గోమాత‌కు నాన‌బెట్టిన గోధుమ‌లు పెడితే కీర్తి, ప‌ట్టుద‌ల పెరుగుతాయట.

నాన‌బెట్టిన బొబ్బ‌ట్లను గోమాత‌కు పెడితే ధ‌నాభివృద్ధి పెరుగుతుందట.

గోమాత‌కు నాన‌బెట్టిన ఉల‌వ‌లు పెడితే వృత్తిలో నిల‌క‌డ ల‌భిస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమలలో త్వరగా దర్శనం చేసుకోవడానికి ఏడు మార్గాలు -అవేంటో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×