E-Paper
Advertisement

రాజకీయ నాయకుని లక్షణాలు ఉన్న వ్యక్తులు ఏ నెలలో పుడతారో తెలుసా..?

రాజకీయ నాయకుని లక్షణాలు ఉన్న వ్యక్తులు ఏ నెలలో పుడతారో తెలుసా..?
Advertisement

Politician: ఆ నెలలో పుట్టిన వ్యక్తులకు పుట్టకతోనే నాయకత్వలక్షణాలు వస్తాయట. వారి ఎప్పటికైనా జీవితంలో గొప్ప గొప్ప లీడర్లుగా తయారవుతారట. ఇంకా ఆ నెలలో పుట్టిన వారు ఏ రంగంలో ఉన్నా టాప్‌ పొజిషన్‌కు వెళ్తారట. ఇంతకీ ఏ నెలలో పుట్టిన వారికి ఇన్ని క్వాలిటీస్‌ ఉంటాయో తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆగష్టు నెలలో జన్మించిన వ్యక్తులకు సహజంగానే ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వస్తుందట. ఇంకా ఆగస్టు నెలలో పుట్టిన వారి జీవితం, భవిష్యత్తు, ఏ రంగంలో స్థిరపడతారు లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఆగష్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం, లక్షణాలు: ఆగస్టులో పుట్టిన వారు నాయకులట. ఏ పని చేసినా ముందుండి నడిపించాలనుకుంటారట. అందరి దృష్టిని ఆకర్షించడంలో వీరు ముందుంటారట. వీరికి తమ సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉంటుందట. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్తారట. ఏ విషయంలోనైనా కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారట. వీరికి అబద్ధాలు చెప్పడం లేదా గోప్యంగా ఉండటం అస్సలు నచ్చదట. అలాగే ఇతరులకు సహాయం చేయడంలోనూ  ముందుంటారట.

ఆగస్టులో పుట్టిన వారి భవిష్యత్తు: ఆగస్టులో పుట్టిన వారి భవిష్యత్తు చాలా అద్బుతంగా ఉంటుందట. వీరు అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్ లేదా రాజకీయ రంగంలో బాగా రాణిస్తారట. ఇంకా కళలు, సినిమా, రంగస్థలం వంటి సృజనాత్మక రంగాల్లో కూడా నెంబర్‌వన్‌ పొజిషన్ కు వెళ్తారట. అలాగే సొంతంగా వ్యాపారం ప్రారంభించి.. పదిమందికి ఉపాధి కల్పించడంలో వీరు సక్సెస్‌ అవుతారట.

Advertisement

ఆగస్టు వారికి కలిసొచ్చే అంశాలు: ఆగస్టులో పుట్టిన వారికి బంగారు రంగు, (Gold), నారింజ (Orange), పసుపు రంగులు బాగా కలిసివస్తాయట. వీరికి ఆదివారం, గురువారం మంచి రోజులట. ఆయా రోజులలో ఏదైనా పని మొదలు పెడితే సక్సెస్‌ అవుతారట. వీరికి అదృష్ట సంఖ్యలు 1, 4, 10, 13, 19, 28 అంటూ సూచిస్తున్నారు పండితులు.

ఆగస్టులో పుట్టిన వారికి జీవితంలో టర్నింగ్ పాయింట్: ఆగష్టులో పుట్టిన వారి జీవితంలో  28 నుండి 35 ఏళ్ల మధ్య ఒక కీలకమైన మలుపుగా ఉంటుందట. ఈ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాలు వారి స్థిరత్వానికి పునాదులు వేస్తాయట. ముఖ్యంగా, తాము చేస్తున్న వృత్తిలో మరింత బాధ్యతాయుతమైన పదవిని చేపట్టడం లేదా సొంతంగా ఏదైనా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడం ద్వారా వీరి జీవితం మరో స్థాయికి చేరుకుంటారట.

అయితే ఈ నెలలో పుట్టిన వారికి అహంకారం ఎక్కువగానే ఉంటుందట. దీని వల్ల వీరు ఒక్కోసారి సమస్యలు కొని తెచ్చుకుంటారట. ఆహంకారాన్ని విడిచిపెట్టి ముందుకు సాగితే జీవితంలో వీరికి ఎదురే ఉండదట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: విదుర నీతి ప్రకారం భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు చేయకూడదట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×