Two marriages: రెండు పెళ్ళిల్లు ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా వింటున్నాము కానీ 80, 90వ దశకాల్లో అయితే రెండు పెళ్లిళ్లు అనేవి చలా కామన్‌గా జరుగుతుండేవట. చాలా మంది చిన్న కారనం దొరికినీ రెండో పెళ్లి వైపు మొగ్గు చూపేవారట. అయితే ఎక్కువగా రెండు పెళ్లిళ్లు అనేవి ఆ తేదీల్లో పుట్టిన వారికే అవుతుంటాయట. న్యూమరాలజీ ప్రకారం రెండు పెళ్లిళ్లు ఏ తేదీల వారికి అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్రం (Numerology) మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీ లేదా గ్రహ గతులు వారి వివాహ జీవితంపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు. అయితే, రెండు పెళ్లిళ్లు అవుతాయని కేవలం పుట్టిన తేదీని బట్టి ఖచ్చితంగా చెప్పలేమని.. ఇది వారి జాతకంలోని సప్తమ స్థానం (వివాహ స్థానం) శుక్రుడు మరియు కుజుడి ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీలల్లో పుట్టిన వారి స్వభావం వల్ల వివాహ జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతుంటారు. అలా ఒడిదుడుకుల వల్లనో మరే కారణం వల్లనో రెండు పెళ్లిళ్లు చేసుకునే వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రుడి ప్రభావం ఉన్న సంఖ్యలు: 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారిపై చంద్రుడి ప్రభావం ఉంటుందట. వీరు చాలా సున్నిత మనస్కులు మరియు భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతుంటారట. అయితే వీరు తమ భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా తట్టుకోలేకపోవడం వల్ల కొన్నిసార్లు సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందట. అందుకే ఈ తేదీలలో పుట్టిన వారికి ఎక్కువగా రెండు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
బుధుడి ప్రభావం ఉన్న సంఖ్యలు: 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందట. వీరు కొత్తదనాన్ని కోరుకుంటారట.. అలాగే స్వతంత్రంగా ఉండాలని భావిస్తారట. దీంతో వీరికి వివాహ జీవితంలో బంధనాలు ఎక్కువయ్యాయని అనిపిస్తే.. వీరు ఆ బంధం నుండి బయటకు రావాలని ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలా అనుకోవడం వల్లే ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కువగా రెండు పెళ్లిళ్లు అవుతుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
శని ప్రభావం ఉన్న సంఖ్యలు: 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి శని ప్రభావం వల్ల వివాహంలో జాప్యం జరగడం లేదా మొదటి వివాహంలో కొన్ని కఠినమైన సవాళ్లు ఎదురుకావడం జరుగుతుంటాయట. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారికి కూడా రెండు పెళ్లిళ్లు అయ్యే అవకాశం ఉంటుందట.
అయితే ఇవి కేవలం సంఖ్యాశాస్త్ర అంచనాలు మాత్రమేనని. వీటిని ఒక హెచ్చరికగా భావించి వైవాహిక జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. వీటికి భయపడాల్సిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.