E-Paper
Advertisement

Human Being: మనిషి తీర్చుకోలేని రుణాలు ఏంటో తెలుసా..?

Human Being: మనిషి తీర్చుకోలేని రుణాలు ఏంటో తెలుసా..?
Advertisement

Human Being: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, మనిషి జన్మించినప్పుడే కొన్ని రుణాలను (అప్పులను) తన వెంట తెచ్చుకుంటాడట. వీటిని  పంచ మహాయజ్ఞాలు  లేదా “త్రిరుణాలు” అని పిలుస్తారట. ముఖ్యంగా మూడు ప్రధాన రుణాలు ప్రతి మనిషి తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయట. ఆ రుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవ రుణము (Debt to Gods): ప్రకృతిలో మనకు లభించే గాలి, నీరు, వెలుతురు వంటివన్నీ దేవతల అనుగ్రహంగా భావిస్తారు. కాబట్టి వాటి రుణం తీర్చుకోవాలని శాస్త్రం చెబుతుందట. అయితే వాటి రుణాన్ని యజ్ఞ యాగాదులు నిర్వహించడం, దైవ ప్రార్థన, ప్రకృతిని గౌరవించడం మరియు పర్యావరణాన్ని కాపాడటం ద్వారా ఈ రుణం తీరుతుందట. ఈ రుణం తీర్చుకోకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడం, మనశ్శాంతి లేకపోవడం అలాగే మనం చేసే పనుల్లో ఆటంకాలు కలగడం వంటివి జరుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయట.

Advertisement

ఋషి రుణము (Debt to Sages): మన సంస్కృతిని, జ్ఞానాన్ని, వేదాలను మరియు పురాణాలను మనకు అందించిన మహర్షులకు మనం బాకీ పడి ఉన్నామట. వారి రుణాలను కూడా తప్పకుండా తీర్చుకోవాలట. ఈ రుణాలను సద్గ్రంథాలను చదవడం, విద్యాదానం చేయడం (మరొకరికి జ్ఞానాన్ని పంచడం) మరియు ధర్మాన్ని పాటించడం ద్వారా తీర్చుకోవాలని శాస్త్రం చెప్తుందట. ఈ రుణాలు తీర్చుకోకపోతే అజ్ఞానంలో ఉండిపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం మరియు సమాజంలో గౌరవం తగ్గడం వంటివి సంభవిస్తాయట.

పితృ రుణము (Debt to Ancestors): మనకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, వంశాభివృద్ధికి కారకులైన పూర్వీకులకు మనం రుణపడి ఉంటామట. వారి రుణాన్ని కూడా తల్లిదండ్రులను జీవించి ఉన్నప్పుడు గౌరవంగా చూసుకోవడం, వారు మరణించిన తర్వాత పితృ కార్యాలు (తద్దినాలు) నిర్వహించడం మరియు మన సంతానాన్ని సన్మార్గంలో పెంచడం ద్వారా తీర్చుకోవాలట. ఈ రుణాన్ని తీర్చుకోకపోతే వంశాభివృద్ధి ఆగిపోవడం (సంతాన లేమి), కుటుంబంలో గొడవలు మరియు పితృ దోషాల వల్ల జీవితంలో స్థిరత్వం లేకపోవడం జరుగుతుందని శాస్త్రం చెబుతోందట.

Advertisement

ఈ రుణాలు తీర్చుకోకపోతే ఏం జరుగుతుంది?: ఆధ్యాత్మిక కోణంలో ఈ రుణాలు తీర్చుకోకపోవడాన్ని  కృతజ్ఞత లేకపోవడం గా భావిస్తారట. దీనివల్ల కలిగే ప్రధాన నష్టాలు ఏంటంటే జన్మ రాహిత్యం లభించదట. మనిషి మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి ఉంటుందట (పునర్జన్మ). అంటే మోక్షం లభించదని అర్థం. అలాగే జీవితంలో ఎంత సంపాదించినా, ఏ హోదాలో ఉన్నా ఏదో తెలియని వెలితి, అశాంతి వెంటాడుతూనే ఉంటాయట. మనం ఎవరికైతే రుణపడి ఉన్నామో, వారికి తిరిగి చెల్లించనప్పుడు అది నెగటివ్ కర్మగా మారుతుందట. ఇది మన తరువాతి తరాలకు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఇక్కడ ‘రుణం’ అంటే కేవలం డబ్బు అని కాదు, బాధ్యత అని అర్థం. ఈ బాధ్యతలను నెరవేర్చడమే మనిషి యొక్క పరమార్థమని శాస్త్రం చెబుతుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమల వెంకటేశ్వరస్వామి కుబేరుడి దగ్గరే ఎందుకు అప్పు తీసుకున్నారో తెలుసా..? అసలు రహస్యం అదే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×