E-Paper
Advertisement

Lord Venkateswara: తిరుమల వెంకటేశ్వరస్వామి కుబేరుడి దగ్గరే ఎందుకు అప్పు తీసుకున్నారో తెలుసా..? అసలు రహస్యం అదే

Lord Venkateswara: తిరుమల వెంకటేశ్వరస్వామి కుబేరుడి దగ్గరే ఎందుకు అప్పు తీసుకున్నారో తెలుసా..? అసలు రహస్యం అదే
Advertisement

Lord Venkateswara: తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్ష్యాత్తు శ్రీ మహావిష్ణువు అయినా కూడా ఆయన కుబేరుడి దగ్గరే ఎందుకు అప్పు తీసుకున్నారు. అందులో మర్మం ఏంటి.. ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు లక్ష్మీపతి (శ్రీమహావిష్ణువు). సంపదకు మూలదేవత అయిన లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంలోనే ఉంటుంది. మరి అపారమైన సంపద గల ఆయన కుబేరుడి వద్ద అప్పు తీసుకోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక, తాత్విక అర్థాలు ఉన్నాయంటున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

భృగు మహర్షి శాపం – లక్ష్మీదేవి అలుక: పురాణ గాథ ప్రకారం, భృగు మహర్షి విష్ణువు వక్షస్థలంపై తన్నడం వల్ల లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి (కొల్లాపూర్ లేదా కరవీరపురం) వస్తుంది. అమ్మవారు లేని వైకుంఠం వెలవెలబోతుంది. శ్రీనివాసుడు కూడా భూలోకానికి వచ్చి సాధారణ మానవుడిలా తపస్సు చేస్తాడు. అంటే, లక్ష్మీదేవి దూరం కావడం వల్ల ఆయన నిరుపేదగా (దరిద్ర నారాయణుడిగా) భూమిపై అవతరించారని చెబుతుంటారు.

మానవ ధర్మం పాటించడం: స్వామివారు భూమిపై మానవ రూపంలో (శ్రీనివాసుడు) అవతరించినప్పుడు, లోక రీతిని అనుసరించాలి. ఒక సామాన్య మానవుడు వివాహం చేసుకోవాలంటే ధనం అవసరం. పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి అవసరమైన లాంఛనాల కోసం ఆయన అప్పు తీసుకున్నారు. భగవంతుడైనా సరే భూమిపై ఉన్నప్పుడు ఇక్కడి కర్మ సూత్రాలకు, కట్టుబాట్లకు లోబడి ఉంటారని చూపించడం దీని ఉద్దేశ్యంగా పండితులు చెప్తున్నారు.

Advertisement

కుబేరుడి గర్వభంగం & భక్తి: కుబేరుడు సంపదకు అధిపతి. కానీ ఆ సంపద అంతా భగవంతుడు ప్రసాదించిందే. తన దగ్గర ఉన్న ధనం తనది కాదని, అది స్వామి సేవకే వినియోగపడాలని కుబేరుడికి తెలియజేయడానికే ఆయన అప్పు తీసుకున్నారు. దీనివల్ల కుబేరుడికి స్వామివారి కళ్యాణంలో భాగస్వామ్యం లభించిందట.

భక్తులతో అనుబంధం (ప్రధాన కారణం): స్వామివారు అప్పు తీసుకోవడం వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం  భక్తులను అనుగ్రహించడం. ఆయన అప్పు తీసుకుంటేనే కదా, మనం వడ్డీ రూపంలో ఆయనకు కానుకలు సమర్పిస్తాం.. మనం ఇచ్చే చిన్న కానుకను ఆయన తన అప్పు తీర్చుకోవడానికి స్వీకరిస్తూ, బదులుగా మనకు అనంతమైన పుణ్యాన్ని, సంపదను ప్రసాదిస్తారు. భక్తుడికి, భగవంతుడికి మధ్య ఒక లావాదేవీ సంబంధం. ఈ ప్రేమ సంబంధాన్ని ఏర్పరచడానికి ఈ అప్పు ఒక నెపం మాత్రమేనని చెప్తుంటారు పండితులు.

లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉంటే అప్పు ఎందుకు?: లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉన్నా, వివాహ సమయంలో ఆమె పద్మావతి అమ్మవారి రూపంలో ఆకాశరాజు పుత్రికగా వేరే చోట ఉంది. అప్పటికి శ్రీనివాసుడికి, పద్మావతికి వివాహం జరగలేదు. అందుకే శాస్త్రోక్తంగా వివాహం జరిపించడానికి, లోక కళ్యాణం కోసం ఆయన కుబేరుడిని ఆశ్రయించారట.

స్వామి వారికి వడ్డీకాసుల వాడు అని పిలిపించుకోవడంలో ఆనందం ఉందని. ఎందుకంటే తన అప్పు తీర్చడానికి వచ్చే భక్తుల కష్టాలను ఆయన తీరుస్తారని నమ్మకం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ తేదీలో పుట్టిన వారికి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×