E-Paper
Advertisement

జాన్వీ కపూర్ గ్లామర్ డోస్.. హద్దులు దాటుతున్న శ్రీదేవి తనయ! ఆ డ్రెస్ ఏంటి బాబోయ్?

జాన్వీ కపూర్ గ్లామర్ డోస్.. హద్దులు దాటుతున్న శ్రీదేవి తనయ! ఆ డ్రెస్ ఏంటి బాబోయ్?
Advertisement

Janhvi Glamour :జాన్వీ కపూర్… అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ధడక్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ బాంబే బ్యూటీ ఈ మధ్య సినిమాలా కన్నా గ్లామర్ షో తోనే తెగ హైలెట్ అవుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మడికట్టుక్కూర్చున్న ఈ అమ్మడు గత కొంతకాలంగా అందాలని ఓ రేంజ్ లో ఆరబోస్తుంది..ఇక లేటెస్ట్ గా జాన్వీ ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో కనిపించిన తీరుని షాక్ అయిపోయారంతా. “అతిలోక సుందరి కూతురు కదా అంటే ఆ మాత్రం ఉండాలి” అని కొందరంటే ముందు ఆ స్కిన్ షో ఆపేసి సినిమాల మీద దృష్టి పెట్టు అంటూ మరికొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

మైక్రో మినీ డ్రెస్ వేసుకొని బోల్డ్ షో

Advertisement

రీసెంట్‌గా జరిగిన ఫెంటీ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ తన డ్రెస్సింగ్‌తో అందరికి పెద్ద షాకే ఇచ్చింది. బాడీకి అతుక్కున్నట్టుగా ఉండే మైక్రో మినీ డ్రెస్ వేసుకొని బోల్డ్ షో చేసేసింది. మెత్తటి కౌల్ నెక్ లైన్‌తో కూడిన హాఫ్ షోల్డర్ వైట్ టాప్, శాటిన్ ఫ్యాబ్రిక్ డ్రెస్సులో ఆమె లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అయితే బాడీకి అతుక్కుపోయినట్టుగా ఉన్న ఈ డ్రెస్సింగ్ స్టైలే ఇపుడు సోషల్ మీడియాలో డిబేటబుల్ అయ్యింది. కేవలం కెమెరాల అటెన్షన్ కోసమే జాన్వీ ఇలా అందాలు ఆరబోస్తుందని, అందరి లుక్ ని గ్రాబ్ చేయడానికే ఫ్యాషన్ పేరుతో బరి తెగిస్తుందని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఆమె నడక, పోజులు చూస్తుంటే సినిమా ప్రమోషన్ కంటే సెల్ఫ్ ప్రమోషన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోందని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

also read :తెలంగాణ ‘ఐస్ ఆపిల్స్’: నోరూరించే తాటిముంజలతో ఇన్ని లాభాలా? తెలిస్తే రోజూ తింటారు!

సౌత్ ఇండస్ట్రీపై కన్ను 

2018లో ‘ధడక్’తో కెరీర్ మొదలుపెట్టిన జాన్వీకి ఇప్పటివరకు తన నటనతో మెప్పించిన సందర్భాలు చాలా తక్కువ. ఘోస్ట్ స్టోరీస్ లాంటి సినిమాలు చేసినా, బాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను ఒక స్టార్ హీరోయిన్‌గా అంగీకరించడానికి ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నారు.ఇక హిందీలో ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో, ఇప్పుడు తన రూట్ మార్చి సౌత్ ఇండస్ట్రీపై కన్నేసింది.అయితే  తల్లి శ్రీదేవికి సౌత్‌లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకే జాన్వీ ఇక్కడికి వచ్చిందనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది.

ఇందులో కూడా అందాలు ఆరబోయడమేనా

ఇక తెలుగులో దేవర పార్ట్ 1 లో జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా కనిపించిన జాన్వీ స్కిన్ షో చేయడానికి పనికి వచ్చిందే తప్ప నటన పరంగా పెద్దగా మెప్పించలేదనే చెప్పాలి, నిజానికి ఆమెకి సినిమాలో దక్కిన స్కోప్ చాలా తక్కువే. మరి దేవర 2 లో ఏమైనా షో చేయకుండా నటిస్తుందేమో చూడాలి. ఇక ఇదిలా ఉంటె జాన్వీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్దిలో అచ్చియమ్మ’గా కనిపిస్తుంది. మరి ఇందులో కూడా అందాలు ఆరబోయడమేనా, లేక నటనతో ఏమైనా మెప్పిసుందా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారంతా. ఇది గనుక తేడా కొడితే జాన్వి కెరీర్ అంత ఈజీగా సాగదన్నది నిజం. ఎందుకంటే గ్లామర్ షోతో, వైరల్ డ్రెస్సులతో ఇండస్ట్రీలో అన్ని సార్లు నెట్టుకురాలేరు కదా!

మొత్తానికి, జాన్వీ కపూర్ తన బోల్డ్ షోతో నెట్టింట హైలెట్ అవుతున్నా ఒక నటిగా మాత్రం ‘శ్రీదేవి కుమార్తె’ అనే ట్యాగ్‌ను మాత్రం దాటలేకపోతుంది. చూడాలి మరి వచ్చే సినిమాలతో అయినా తనపై వస్తున్న ట్రోల్స్ కి ఆన్సర్ ఇస్తుందో!

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

also read :పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వొచ్చు అంటున్న నిత్యా మీనన్

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×