E-Paper
Advertisement

Dogs in Dream: కలలో కుక్కులు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా..?

Dogs in Dream: కలలో కుక్కులు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా..?
Advertisement

Dogs in Dream: మీకు కుక్కలు కలలోకి వస్తున్నాయా..? అవి మిమల్ని చూసి మొరుగుతున్నాయా..? లేదా సైలెంట్‌గా ఉన్నాయా..? కుక్కలు కలలోకి వస్తే దేనికి సంకేతమో తెలుసా..? విభిన్న సందర్భాలలో కుక్కులు కలలోకి వస్తే విభిన్నమైన అర్థాలు ఉంటయంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.

కలల శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కలలో కుక్కలు కనిపించడం అనేది ఆ కుక్క ఉన్న స్థితి మరియు అది చేసే పనిని బట్టి వేర్వేరు అర్థాలను కలిగి ఉంటుందట. సాధారణంగా కుక్కను విశ్వాసానికి, రక్షణకు మరియు స్నేహానికి చిహ్నంగా భావిస్తారు. కలలో కుక్కలు కనిపిస్తే కలిగే కొన్ని సాధారణ సంకేతాల గురించి ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

Advertisement

సానుకూల సంకేతాలు (Positive Meanings): ఒక ఫ్రెండ్లీగా ఉన్న కుక్క కలలో కనిపిస్తే, మీ జీవితంలో ఒక నమ్మకమైన వ్యక్తి లేదా స్నేహితుడి మద్దతు మీకు లభిస్తుందని అర్థమట. కుక్క మిమ్మల్ని కాపాడుతున్నట్లు కలలో కనిపిస్తే.. మీరు ఒక క్లిష్ట పరిస్థితి నుండి సురక్షితంగా బయటపడతారని లేదా ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతుందని అర్థం చేసుకోవాలట. కుక్క మీ వెనుక తోక ఊపుకుంటూ వస్తుంటే, మీరు చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుందని సంకేతమట.

ప్రతికూల సంకేతాలు (Cautionary Meanings): మీకు కలలో కుక్క కరిస్తే, మీకు అత్యంత సన్నిహితులైన వారి నుండి ద్రోహం లేదా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికగా బావించాలట. ఇది నమ్మకద్రోహానికి చిహ్నంగా కూడా చెప్తుంటారు స్వప్న శాస్త్ర నిపుణులు. ఇక కోపంగా మొరుగుతున్న కుక్క కనిపిస్తే, మీ శత్రువుల నుండి మీకు ప్రమాదం పొంచి ఉందని లేదా మీరు ఏదో ఒక విషయంలో గిల్టీగా (అపరాధ భావం) ఫీలవుతున్నారని అర్థం చేసుకోవాలట. ఒక పిచ్చి కుక్క మిమ్మల్ని కలలో వెంబడిస్తుంటే, మీ జీవితంలో ఎదురయ్యే పెద్ద సవాళ్లను లేదా ఒత్తిడిని మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ కలకు అర్థమట.

Advertisement

ఆధ్యాత్మిక కోణం (Spiritual Significance): భారతీయ సంప్రదాయంలో కుక్కను కాలభైరవుడి వాహనంగా భావిస్తారు. కలలో కుక్కలు కనిపించడం అంటే ఆ దైవ అనుగ్రహం ఉందని లేదా శని ప్రభావం వల్ల కలిగే దోషాల గురించి హెచ్చరిక అని కూడా భావించాలని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

కొన్ని ఇతర సందర్భాలు: మీకు కలలో కుక్క చనిపోయినట్టు కనిపిస్తే.. ఇది ఒక మంచి సంబంధం ముగిసిపోవడాన్ని లేదా మీలోని ఒక సహజమైన శక్తిని మీరు కోల్పోతున్నారని అర్థ చేసుకోవాలట. ఒకవేళ మీకు కలలో కుక్క పిల్లలు కనిపిస్తే మీకు కొత్త స్నేహాలు, సంతోషం మరియు ఎదుగుదలకు సంకేతంగా భావించాలట.

కలలు అనేవి మన ఉపచేతన మనస్సు (Subconscious mind) లోని ఆలోచనల ప్రతిరూపాలు కూడా కావచ్చు. కాబట్టి, ఆ సమయంలో మీ మానసిక స్థితిని బట్టి కూడా వీటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ తేదీలో పుట్టిన వారికి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×