E-Paper
Advertisement

H-1B వీసాలపై 3 ఏళ్ల పాటు నిషేధం.. యూస్ కాంగ్రెస్ లో బిల్లు

H-1B వీసాలపై 3 ఏళ్ల పాటు నిషేధం.. యూస్ కాంగ్రెస్ లో బిల్లు
Advertisement

H-1B Visa Ban: అమెరికా టెక్ కంపెనీలు భారత్ సహా విదేశీయులను హెచ్-1బీ వీసా ద్వారా నియమించుకుంటాయి. అయితే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా కార్యక్రమంపై ముందు నుంచి అక్కసు వెళ్లగక్కుతున్నారు. తాజాగా మరో అడ్డంకిని సృష్టించేందుకు ట్రంప్ ప్రభుత్వం రెడీ అవుతుంది. యూఎస్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ చట్టసభ్యులు.. మూడేళ్ల పాటు హెచ్-1బీ వీసాల జారీపై నిషేధం విధించాలని కోరుతూ ఒక బిల్లను ప్రవేశపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా దరఖాస్తులపై 1,00,000 డాలర్ల ఫీజు ప్రకటించిన కొన్ని నెలల తర్వాత హెచ్-1బీ వీసా కార్యక్రమానికి మరో అడ్డంకిని సృష్టించేందుకు రెడీ అవుతున్నారు.

హెచ్-1బి దుర్వినియోగం ఆరోపణలు

అమెరికన్ల స్థానంలో తక్కువ ఖర్చుతో విదేశీయులను నియమించడానికి హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని టెక్ కంపెనీలు దుర్వినియోగం చేశాయని రిపబ్లికన్లు వాదిస్తున్నారు. హెచ్-1బీ వీసాలను మూడేళ్లపాటు నిలిపివేయాలని కోరుతూ యూఎస్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ చట్టసభ్యులు ఒక చట్టాన్ని ప్రతిపాదించింది. అరిజోనాకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఎలీ క్రేన్, ఏడుగురు రిపబ్లికన్ చట్టసభ్యుల మద్దతుతో ఎండ్ హెచ్-1బీ వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026’ను ప్రవేశపెట్టారు.

Advertisement

ప్రతిపాదిత బిల్లు H-1B ప్రోగ్రామ్‌లో అనేక మార్పులను సూచించారు. వీటిలో వీసాల వార్షిక పరిమితిని 65,000 నుంచి 25,000కు తగ్గించడం, సంవత్సరానికి కనీస జీతం అవసరాన్ని 2,00,000 డాలర్లుగా నిర్దేశించడం, H-1B వీసా హోల్డర్లు తమపై ఆధారపడిన వారిని యునైటెడ్ స్టేట్స్‌కు తీసుకురాకుండా నిరోధించడం వంటి నిబంధనలు ఉన్నాయి.

భారతీయ నిపుణులు

హెచ్-1బి వీసా కార్యక్రమాన్ని అమెరికా టెక్నాలజీ సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఎక్కువగా, ముఖ్యంగా భారతీయులను నియమించుకుంటున్నాయి. ఈ వీసాలను పొందిన వారిలో భారతీయ నిపుణులు టెక్నాలజీ, హెల్త్ రంగాల్లో ఎక్కువగా ఉన్నారు.

Advertisement

ఈ బిల్లు లాటరీ స్థానంలో వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టడం, అర్హత కలిగిన అమెరికన్ కార్మికులకు ఉద్యోగాలు కల్పన, H-1B కార్మికులు ఒకటికి మించి ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించడం, థర్డ్-పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీలు ఉద్యోగులను నియమించుకోకుండా పరిమితం చేయడం వంటి అదనపు సంస్కరణలను ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఫెడరల్ ఏజెన్సీలు హెచ్-1బీ ఉద్యోగులను నియమించుకోవడం లేదా స్పాన్సర్ చేయడాన్ని నిషేధించాలని, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ని ముగించాలని, H-1B హోల్డర్లు శాశ్వత నివాసానికి మారకుండా నిరోధించడం ఈ బిల్లులో ఉన్నాయి.

ఫెడరల్ ప్రభుత్వం కష్టపడి పనిచేసే పౌరుల కోసం పనిచేయాలి కానీ భారీ కార్పొరేషన్ల లాభాల కోసం కాదని బిల్లులో పేర్కొన్నారు. హెచ్-1బీ వ్యవస్థలోని లోపాలు అర్హత ఉన్న వారిని ఉద్యోగాలకు దూరం చేయకుండా నిరోధించాల్సిన బాధ్యత తమపై ఉందని క్రేన్ అన్నారు.

బ్రిటన్ బాదుడు, వీసా ఫీజు 25 శాతం పెంపు.. ఎవరిపై ఎంత భారం?

H-1B వీసాలు నిలిపివేస్తారా?

అమెరికా హెచ్-1బి వీసా కార్యక్రమాన్ని చట్టబద్ధంగా నిలిపివేయవచ్చని, ఆ అధికారం కాంగ్రెస్‌కు ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ వీసా కేటగిరీని నిలిపివేయాలని నిర్ణయిస్తే, ప్రభుత్వం దానిని తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×