Money: మీకు తరచుగా రోడ్డు మీద డబ్బులు దొరుకుతున్నాయా..? అయితే అలా దొరకడం దేనికి సంకేతమో తెలుసా..? మన శాస్త్రాల ప్రకారం రోడ్డు మీద డబ్బులు దొరికితే ఏమవుతుందో తెలుసా..? చాలా మందికి తెలియని రహస్య విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
రోడ్డు మీద తరచుగా డబ్బులు దొరకడం అనేది రకరకాల నమ్మకాలు, ఆధ్యాత్మిక కోణాలు మరియు మనస్తత్వశాస్త్రంతో ముడిపడి ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. అయితే హిందూ గ్రంథాల ప్రకారం రోడ్డు మీద డబ్బులు దొరకడం దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంకేతాలు: రోడ్డు మీద డబ్బులు దొరకడం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తారని పండితులు చెప్తున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం కానీ మరే ఇతర హిందూ శాస్త్రాల ప్రకారం చూసుకున్నా రోడ్డు మీద డబ్బు దొరకడం అనేది లక్ష్మీ కటాక్షంగా చెప్తున్నారు. డబ్బును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి అది దొరకడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం రాబోతుందనే నమ్మకంగా చాలా మంది బావిస్తారని పండితులు సూచిస్తున్నారు. అలాగే మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా కొత్త పని మొదలుపెట్టినప్పుడు డబ్బు దొరికితే, మేము ఉన్నాము అని దేవతలు ఇచ్చే హామీగా కూడా చూడవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరు తమ పూర్వీకులు (పితృ దేవతలు) తమను ఆశీర్వదిస్తున్నారని, వారికి ఇష్టమైన రూపంలో ఇలా కనిపిస్తారని కూడా బావించొచ్చంటున్నారు.
దొరికిన డబ్బు రకాన్ని బట్టి అర్థాలు: కొన్ని నమ్మకాల ప్రకారం నాణెం లేదా నోటు దొరకడానికి వేర్వేరు అర్థాలు ఉన్నాయంటున్నారు పండితులు. మీకు రోడ్డు మీద నాణేలు దొరికితే అవి లోహంతో చేసినవి కాబట్టి, ఇవి పాత బంధాలు లేదా పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉంటాయని.. కొత్త ఆరంభానికి ఇది సంకేతంగా భావించాలని సూచిస్తున్నారు. ఇక నోట్లు దొరికితే మీరు మీ భయాలను వదిలేసి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రకృతి సూచిస్తున్నట్లుగా బావించాలట.
మనస్తత్వ శాస్త్ర కోణం (Psychological View): మీకు తరచుగా డబ్బులు కనిపిస్తున్నాయి అంటే మీ ఏకాగ్రత (Focus) ఆ విషయంలో ఎక్కువగా ఉందని అర్థంమట. దీనిని “సెలెక్టివ్ పర్సెప్షన్” అంటారట. అంటే, మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో లేదా దేని మీద దృష్టి పెడతామో, మన కళ్ళకు అవే ఎక్కువగా కనిపిస్తాయట.
డబ్బు దొరికినప్పుడు ఏం చేయాలి?: శాస్త్రాలు మరియు పెద్దలు చెప్పే దాని ప్రకారం రోడ్డు మీద డబ్బు దొరికితే అది తక్కువ మొత్తమైనా, ఎక్కువ మొత్తమైనా.. కృతజ్ఞతతో స్వీకరించాలట. అలాగే దొరికిన డబ్బు మీ కష్టార్జితం కాదు కాబట్టి, దానిని ఏదైనా గుడిలో హుండీలో వేయడం లేదా పేదవారికి దానం చేయడం ఉత్తమమట. దీనివల్ల ఆ డబ్బుతో వచ్చే దోషం ఏమైనా ఉంటే తొలగిపోతుందని పండితులు సూచిస్తున్నారు.
ఇవన్నీ నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయట. ఇలా డబ్బు దొరకడం కేవలం ఒక యాదృచ్చికం (Coincidence) కూడా కావచ్చు. కాబట్టి దీని గురించి అతిగా ఆలోచించి భ్రమ పడకుండా మీ కష్టాన్ని నమ్ముకోవడం మంచిదట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.