E-Paper
Advertisement

గుడ్ న్యూస్.. నర్సాపూర్ మున్సిపాలిటీ నగర అభివృద్ధికి రూ.15 కోట్లు..!

గుడ్ న్యూస్.. నర్సాపూర్ మున్సిపాలిటీ నగర అభివృద్ధికి రూ.15 కోట్లు..!
Advertisement

Minister Vivek: స్వేచ్ఛ బ్యూరో: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ,జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ , మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజ యాదవ్ , గ్రంధాలయ చైర్మన్ చిలె మల సుహాసినిరెడ్డి, మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి, మంత్రి పాల్గొన్నారు మొదటిగా నగర అభివృద్ధి పథకం కింద నర్సాపూర్ మున్సిపాలిటీ లో 15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మ రెడ్డి తో మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు.

మంత్రి మాట్లాడుతూ..

పర్యటనలో భాగంగా మంత్రి నర్సాపూర్ 04,,06 వ వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వార్డ్ (4th) దుద్దాల దుర్గమ్మ భర్త అశోక్ 6th వార్డు మహమ్మద్ షకీరా బేగం భర్త యూసఫ్ ఉద్దీన్ గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు. అనంతరం నారాయణపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సూచించారు. . మున్సిపాలిటీ నగరాభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు.

Advertisement

Also Read: అధికారం పోయాకే గుంటనక్కలు గుర్తుకొచ్చాయా? కవితను ప్రశ్నించిన మహేష్ కుమార్ గౌడ్

కొత్తగా ఎన్నికైన సభ్యులు

వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిత్యం ఉంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పని చేస్తుందని, ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని మంత్రి కోరారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించే విధంగా విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని నమోదు పెంచుకోవాలని ఆ దిశలో జరిగే బడిబాట కార్యమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: అమెజాన్‌లో భారీ ఆఫర్.. Samsung Galaxy S25 Ultra పై వేలల్లో తగ్గింపు, డీల్ అస్సలు మిస్సవ్వొద్దు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×