Luckt Mobile Number: మీ మొబైల్ నెంబర్ చివరలో ఆ సంఖ్యలు ఉంటే మీ దశ తిరిగిపోతుందట. ఎన్ని కష్టల్లో ఉన్నా మీరు చేస్తున్న వ్యాపారాలు వృద్దిలోకి వస్తాయట. నిదానంగా మీ వ్యాపారాలు లాభాల బాట పడతాయట. అతి త్వరలోనే మీరు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారట.
న్యూమరాలజీ ప్రకారం మొబైల్ నంబర్ చివర ఏ అంకెలు ఉంటే ధనవంతులు అవుతారనేది చెప్పబడిందట. సంఖ్యాశాస్త్ర నిపుణులు చెప్తున్న దాని ప్రకారం, కొన్ని నిర్దిష్టమైన సంఖ్యలు విజయాన్ని, సంపదను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయట. ఆ సంఖ్యలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
సంపదను పెంచే అదృష్ట సంఖ్యలు: మీ మొబైల్ నంబర్ చివరన ఈ అంకెలు ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుందని న్యూమరాలజిస్టులు సూచిస్తున్నారు వాటిలో మొదటి సంఖ్య ఒకటి. ఇది సూర్యుడికి చిహ్నం. ఈ సంఖ్య మొబైల్ చివరలో ఉంటే నాయకత్వ లక్షణాలను, అధికారాన్ని, వ్యాపారంలో విజయాన్ని ఇస్తుందట. ఇక రెండవ సంఖ్య 6. ఇది శుక్రుడికి (Venus) చిహ్నమట. విలాసవంతమైన జీవితాన్ని, సంపదను మరియు భోగభాగ్యాలను ఈ సంఖ్య ప్రసాదిస్తుందట. నంబర్ చివరలో 6 ఉండటం చాలా మంది ధనవంతుల ఎంపికగా చెప్తుంటారు న్యూమరాలజిస్టులు. ఇక మూడవ సంఖ్య ఎనిమిది. ఇది శని దేవునికి చిహ్నం. కష్టపడి పని చేసే తత్వాన్ని, స్థిరాస్తిని మరియు భారీ ఆర్థిక లాభాలను ఇస్తుందట. అయితే, ఇది అందరికీ సెట్ అవ్వదు.. మీ పుట్టిన తేదీకి అనుకూలంగా ఉంటేనే ఇది కోట్లు సంపాదిస్తుందట. ఇక చివరి సంఖ్య తొమ్మిది. ఇది కుజుడికి చిహ్నం. అదృష్టాన్ని, ధైర్యాన్ని మరియు సామాజిక హోదాను ఈ నెంబర్ ఇస్తుందట.
ముఖ్యమైన కాంబినేషన్లు: కేవలం ఒక్క అంకె మాత్రమే కాకుండా, చివరి రెండు లేదా మూడు అంకెలు ఈ క్రమంలో ఉంటే మంచిదని న్యూమరాలజిస్టులు సూచిస్తున్నారు. అవి 1, 6, 9 ఈ అంకెలు కలిపి రావడం (ఉదాహరణకు 169, 961) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ఇస్తుందట. అలాగే 888 లేదా 999. ఇలా వస్తే కూడా ఆ అంకెలు ఎనర్జీని పెంచి, విజయ అవకాశాలను మెరుగుపరుస్తాయట.
ఏ అంకెలు ఉండకూడదు?: సాధారణంగా మొబైల్ నంబర్ చివర 0, 2, 4 వంటి అంకెలు ఉండటం అంత మంచిది కాదని కొందరు నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ‘0’ చివరన ఉంటే అది ఫలితాలను శూన్యం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
అసలు రహస్యం: మొబైల్ నంబర్ చివరి అంకె కంటే, ఆ పది అంకెల మొత్తం (Total) ఎంత వస్తుంది అనేది చాలా ముఖ్యట. ఎలాగంటే మీ మొబైల్ నంబర్‌లోని 10 అంకెలను కూడాలి. పది అంకెలు కూడగా వచ్చిన రెండంకెల సంఖ్యను మళ్ళీ ఒకే అంకె వచ్చే వరకు కూడాలి. అలా వచ్చిన సింగిల్ డిజిట్ నెంబర్ మీ పుట్టిన తేదీకి (Destiny Number) అనుకూలంగా ఉండాలి. ఇలా ఉంటే చాల మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సంఖ్యాశాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం మొబైల్ నంబర్ మార్చినంత మాత్రాన కోట్లు రావు, దానికి తగ్గ కష్టం మరియు ప్రణాళిక కూడా తోడవ్వాలి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.