E-Paper
Advertisement

Palmistry: అరచేతిలో ఉండే ఏ రేఖల వల్ల గొప్ప రాజకీయ నాయకులు అవుతారో తెలుసా..?

Palmistry: అరచేతిలో ఉండే ఏ రేఖల వల్ల గొప్ప రాజకీయ నాయకులు అవుతారో తెలుసా..?
Advertisement

Palmistry: మీ అరచేతిలో ఉండే ఆ రేఖల వల్ల  మీరు ఎప్పటికైనా గొప్ప రాజకీయ నాయకులు అవుతారట. ఆ రేఖలు చేతిలో ఉంటే మీరెప్పటికైనా పొలిటికల్‌గా చక్రం తిప్పుతారట. ఇంతకీ ఆ రేఖలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హస్తసాముద్రికం (Palmistry) ప్రకారం, ఒక వ్యక్తి గొప్ప రాజకీయ నాయకుడు కావడానికి లేదా సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి అరచేతిలో కొన్ని నిర్దిష్టమైన రేఖలు మరియు పర్వతాలు చాలా బలంగా ఉండాలి. కేవలం ధనం మాత్రమే కాకుండా, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం మరియు ప్రభావం చూపే వ్యక్తిత్వం ఉన్నవారే రాజకీయాల్లో రాణిస్తారు. అయితే కొన్ని రేఖలు బలీయంగా ఉంటే వారే రాజకీయ నాయకులు అవుతారని హస్తసాముద్రికులు చెప్తున్నారు.

Advertisement

బలీయమైన సూర్య రేఖ (Sun Line): రాజకీయాల్లో విజయం మరియు కీర్తి కావాలంటే సూర్య రేఖ చాలా కీలకం. ఈ రేఖ  ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతం అంటారు. అక్కడికి చేరుకునే నిటారుగా ఉన్న రేఖే సూర్య రేఖ. ఈ రేఖ స్పష్టంగా, లోతుగా ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో విపరీతమైన గుర్తింపు, పలుకుబడి లభిస్తాయి. వీరు ప్రజలను ఆకర్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

గురు పర్వతంపై గుర్తులు(Mount of Jupiter): రాజకీయాల్లో నాయకత్వం (Leadership) కోసం గురు పర్వతం చాలా ముఖ్యం. చూపుడు వేలు కింద ఉన్న భాగాన్ని గురు పర్వతం అంటారు. ఈ పర్వతం ఎత్తుగా ఉండి, దానిపై ఒక చతురస్రం(Square) లేదా నక్షత్రం (Star)  వంటి గుర్తు ఉంటే, అది చాలా శుభప్రదం. ఇది ఆ వ్యక్తికి మంచి పరిపాలనా దక్షత, నిర్ణయాధికారం మరియు అధికారాన్ని ఇచ్చే యోగాన్ని సూచిస్తుంది.

Advertisement

మస్తిష్క రేఖ (Head Line): రాజకీయ నాయకులకు తెలివితేటలు, వ్యూహరచన చాలా ప్రధానం. వారికి మస్తిష్క రేఖ కచ్చితంగా ఉండాలి. ఈ రేఖ చాలా పొడవుగా ఉండి, చివరలో కొద్దిగా పైకి వంగి ఉంటే, వారు అద్భుతమైన తెలివితేటలు, దూరదృష్టి కలిగి ఉంటారు. క్లిష్టమైన రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా ఎత్తుగడలు వేయడంలో వీరు సిద్ధహస్తులు.

అదృష్ట రేఖ లేదా భాగ్య రేఖ (Fate Line): ఇది అదృష్టాన్ని ఇచ్చే రేఖ.  ఇది మణికట్టు నుండి మధ్య వేలు వరకు వెళ్తుంది. ఇది స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అదృష్టం తోడవుతుందని అర్థం. రాజకీయాల్లో ఎదిగేందుకు ఈ రేఖ స్థిరత్వాన్ని ఇస్తుంది.

ముఖ్యమైన ఇతర లక్షణాలు: బుధ పర్వతం (Mount of Mercury) చిటికెన వేలు కింద ఉండే ఈ భాగం బలంగా ఉంటే, ఆ వ్యక్తికి వాక్చాతుర్యం  (Communication skills) చాలా బాగుంటాయట. రాజకీయాల్లో మాట్లాడటం, ప్రజలను ఒప్పించడం అనేది ఒక కళ, ఇది ఈ పర్వతం బలంగా ఉన్నవారికి సహజంగానే వస్తుందట. అలాగే రాజకీయాల్లో రాణించే వారి అరచేతులు సాధారణంగా గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులోకి మారుతూ ఉంటే, అది వారిలో ఉండే ఉత్సాహాన్ని, రాజ స్వభావాలను సూచిస్తుందట.

రాజకీయ యోగం సూచించే అరచేతి గుర్తులు: అరచేతిలో త్రిశూలం (Trident) గుర్తు ఉండటం చాలా అరుదు. ఇది నాయకత్వానికి, ఆధిపత్యానికి సంకేతంగా చెప్తుంటారు. అలాగే ధన త్రిభుజం మరియు పై రేఖల కలయిక ఉంటే అది అధికారం మరియు సంపద రెండూ దక్కుతాయని సూచిస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: శ్రీరామనవమి ప్రత్యేకతలు ఏంటి..? దేశంలో ఏక్కడ ఏ విధంగా జరుపుకుంటారో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×