E-Paper
Advertisement

Wealth: అలాంటి ఇంట్లో ఏడు తరాల వరకు తిన్నా తరగని సంపద ఉంటుంది..? 

Wealth: అలాంటి ఇంట్లో ఏడు తరాల వరకు తిన్నా తరగని సంపద ఉంటుంది..? 
Advertisement

Wealth: ఎలాంటి ఇంట్లో ఏడు తరాల వరకు తిన్నా తరగని సంపద ఉంటుందో తెలుసా.. ఎలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందో తెలుసా..? ఎలాంటి ఇంట్లో తరాలతరాలకు సరిపడా సంపద సృష్టించబడి ఉంటుందో తెలుసా..?

శాస్త్ర పురాణాల ప్రకారం, కేవలం అదృష్టం వల్ల మాత్రమే కాకుండా, కొన్ని నిర్దిష్టమైన ధర్మాలు మరియు అలవాట్లు ఉన్న ఇంట్లో సంపద ఏడు తరాల పాటు స్థిరంగా ఉంటుందని చెబుతుంటారు పండితులు. ఏ ఇంట్లో అయితే అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని కోరుకుంటారో  ఆ ఇంట్లో ఉండవలసిన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

స్త్రీలను గౌరవించే ఇల్లు: యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఏ ఇంట్లో అయితే గృహిణి కన్నీరు పెట్టకుండా సంతోషంగా ఉంటుందో, ఆ ఇల్లు తరతరాల పాటు సిరిసంపదలతో తులతూగుతూ ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

అన్నదానం, అతిథి మర్యాద: ఏ ఇంట్లో ఉన్న వాళ్లు తన దగ్గర ఉన్నదానిలో కొంత భాగాన్ని ఆకలితో ఉన్నవారికి (అన్నదానం) పెట్టే స్వభావం కలిగి ఉంటారో అలాంటి వారు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. అతిథులను ఆదరించే గుణం ఉన్నవారికి సంపద ఎప్పటికీ తరగదని పండితులు చెప్తున్నారు.

Advertisement

ధర్మబద్దమైన సంపాదన: అన్యాయంగా లేదా ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం నిలవదట. కష్టపడి, నీతి నిజాయితీలతో సంపాదించే వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర లక్ష్మి గా కొలువై ఉంటుందట. ఇలాంటి పునాది ఉన్న సంపద తరతరాలకు అందుతుందట.

పెద్దల పట్ట గౌరవం, పితృదేవతల ఆశీస్సులు: తల్లిదండ్రులను, వృద్ధులను గౌరవించే ఇంట్లో దేవతల అనుగ్రహం ఉంటుందట. ముఖ్యంగా పితృ దేవతల ఆశీస్సులు ఉన్న కుటుంబాల్లో వంశాభివృద్ధి మరియు ఐశ్వర్యం నిరంతరం కొనసాగుతాయట.

శుభ్రత మరియు ప్రశాంతత: ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. అలాగే నిత్యం గొడవలు, అరుపులు ఉండే ఇంట్లో లక్ష్మి నిలవదట. ప్రశాంతంగా, పరస్పర అవగాహనతో ఉండే ఇట్లో  లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందట.

దైవ చింతన మరియు దీపారాధన: ఎవరైతే  ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తమ ఇంట్లో దీపం వెలిగిస్తారో ఆలాంటి వారి ఇల్లు సానుకూల శక్తితో నిండి ఉంటుందట. అలాగే, సంపాదనలో కొంత భాగాన్ని ధర్మ కార్యాలకు లేదా సామాజిక సేవకు వినియోగించే అలవాటు ఉన్న కుటుంబాల్లో సంపద వృద్ధి చెందుతూనే ఉంటుందట.

అయితే శాస్త్రాల ప్రకారం, సంపద కేవలం ధనం మాత్రమే కాదు. సంతానం, ఆరోగ్యం, మంచి బుద్ధి మరియు కీర్తి కూడా సంపదలే. ఈ గుణాలను అలవరచుకున్నప్పుడు ఆ కుటుంబం ఏడు తరాల పాటు వైభవంగా ఉంటుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పంచ మహా కన్యలు అని ఎవరిని పిలుస్తారు..? వారికున్న ప్రత్యేకలు ఏంటి..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×