E-Paper
Advertisement

Pancha Maha Kanyalu: పంచ మహా కన్యలు అని ఎవరిని పిలుస్తారు..? వారికున్న ప్రత్యేకలు ఏంటి..?

Pancha Maha Kanyalu: పంచ మహా కన్యలు అని ఎవరిని పిలుస్తారు..? వారికున్న ప్రత్యేకలు ఏంటి..?
Advertisement

Pancha Maha Kanyalu: పంచమహా కన్యలు అని ఎవరిని పిలుస్తారు..? వారికున్న ప్రత్యేకతలు ఏంటి..? పెళ్లైనా వారిని కన్యలు అని ఎందుకు సంబోధిస్తారు. పురాణాల ప్రకారం పంచమహా కన్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ పురాణాల ప్రకారం పంచకన్యలు అని ఐదుగురు పుణ్యస్త్రీలను పిలుస్తారట. వీరు ఐదుగురు వేర్వేరు సందర్భాల్లో, వేర్వేరు కుటుంబాల్లో జన్మించినప్పటికీ, వారి పాతివ్రత్యం, ధైర్యం మరియు ధర్మనిష్ఠ కారణంగా వారిని అత్యంత పవిత్రమైన వారుగా జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

Advertisement

పంచమహాకన్యలు ఎవరు?: పంచమహాకన్యలో మొదటి స్త్రీ ఆహల్య ఈమె గౌతమ మహర్షి భార్య. రెండవ స్త్రీ  ద్రౌపది ఈమె పాండవులు భార్య. మూడవ స్త్రీ సీత శ్రీరాముని భార్య, ( కొన్ని సంప్రదాయాలలో సీతకు బదులుగా కుంతి పేరును చేరుస్తారట.) తారాదేవి వాలి భార్య. మందోదరి రావణాసురుని భార్య.

వారిని అలా పిలవడానికి గల కారణాలు: సాధారణంగా కన్య అంటే వివాహం కాని స్త్రీ అని అర్థం. కానీ ఇక్కడ ఈ ఐదుగురు వివాహితలు.. సంతానం ఉన్నవారు కూడా. అయినప్పటికీ వారిని పంచకన్యలు అని పిలవడానికి లోతైన కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు.

Advertisement

మనఃశుద్ధి (Purity of Soul): వీరు జీవితంలో ఎన్నో కష్టాలను, ఆరోపణలను ఎదుర్కొన్నప్పటికీ, వారి మనస్సు ఎప్పుడూ పవిత్రంగానే ఉందట. బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా, వారి ఆత్మ శుద్ధి తగ్గలేదట. అందుకే వారిని నిత్య కన్యలు గా పరిగణిస్తారట.

అగ్ని పరీక్షలు మరియు త్యాగం: అహల్య ఇంద్రుడి మోసం వల్ల శిలగా మారి, రాముడి పాదధూళితో తిరిగి ప్రాణం పోసుకుంది. ఆమె నిర్దోషి అని లోకానికి తెలిసిందట. ద్రౌపది.. ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ, ఆమె తన ధర్మం  ఎప్పుడూ తప్పలేదట. సభలో అవమానం జరిగినప్పుడు భగవంతుడిని నమ్మి తన మానాన్ని కాపాడుకుందట. సీతామాత అగ్ని ప్రవేశం చేసి తన పవిత్రతను చాటుకుందట. భూదేవి పుత్రికగా ఆమె అత్యంత పవిత్రురాలట. తార మరియు మందోదరి ఇద్దరూ తమ భర్తలు తప్పు చేస్తున్నారని తెలిసినా వారికి ధర్మాన్ని బోధించడానికి ప్రయత్నించారట. భర్తల మరణానంతరం కూడా తమ వివేకంతో రాజ్యాన్ని, వంశాన్ని కాపాడారట.

ప్రకృతి సంబంధం: కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఈ ఐదుగురు కన్యలు  పంచభూతాలకు ప్రతీకలట. అందులో  అహల్య – గాలి (వాయువు) అయితే ద్రౌపది – నిప్పు (అగ్ని)కి, సీత – భూమికి, తార – ఆకాశం, మందోదరి – నీరుకు ప్రతీకలుగా చెప్తుంటారు.

పాప విముక్తి: ఈ ఐదుగురిని ప్రతిరోజూ స్మరించడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. వీరి జీవితాలు స్త్రీ శక్తికి, సహనానికి మరియు ధర్మానికి ప్రతీకలుగా నిదర్శనం అంటూ పండితులు చెప్తున్నారు. వీరిని స్మరించడం వల్ల మనస్సులో ఉన్న మాలిన్యం తొలగిపోయి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుందని హిందూ ధర్మం చెబుతోందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: రాగి ఉంగరం ధరించడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×