E-Paper
Advertisement

తక్కువ రిస్క్, మంచి రాబడి.. టాప్ 7 గవర్నమెంట్ సపోర్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్

తక్కువ రిస్క్, మంచి రాబడి.. టాప్ 7 గవర్నమెంట్ సపోర్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్
Advertisement

Govt Investment Schemes: అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులతో స్టాక్ మార్కెట్ లు నష్టాలు చూస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులు అంటే కాస్త ఆలోచించాల్సిందే. తక్కువ రిస్క్, పెట్టుబడికి ఎలాంటి ఢోకా లేకుండా కేంద్ర ప్రభుత్వ మద్దతు, పన్ను ప్రయోజనాలు ఉన్న ఏడు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవేంటంటే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన , నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. పిల్లల చదువులు, అనారోగ్య ఖర్చులు, పదవీ విరమణ కోసం లేదా స్థిరమైన ఆదాయాన్ని కోరుకుంటున్న వారికి ఈ పథకాలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు.

అధిక వడ్డీ రేట్లు

ఉదాహరణకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కు అనుకూలమైంది. ఇందులో పన్ను రహిత ప్రయోజనాలు కూడా ఉంటాయి. అదేవిధంగా, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పదవీ విరమణ చేసిన వారికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. తమ కుమార్తెల విద్య, వివాహ ఖర్చుల కోసం పేరెంట్స్ సుకన్య సమృద్ధి యోజన (SSY) స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా స్థిరమైన రాబడి కోసం చూసేవారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), కిసాన్ వికాస్ పత్ర్ (KVP) బెస్ట్ ఆప్షన్స్. అలాగే మంత్లీ ఇన్ కమ్ కోసం చూస్తున్న వారికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బెటర్, అలాగే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ కు FD లాంటి ప్రయోజనాలు ఉన్నాయి.

పన్ను ప్రయోజనాలు

Advertisement

ఈ స్కీ్మ్స్ మరో స్పెషాలిటీ ఏంటంటే పన్ను ప్రయోజనాలు. ఈ పథకాలలో చాలా వరకు సెక్షన్ 80C పరిధిలోకి వస్తాయి. రూ.1.5 లక్షల వరకు రిబేటును పొందవచ్చు. అయితే, PPF, SSY పథకాల్లో మెచ్యూరిటీ మొత్తంపై పూర్తి పన్ను రహిత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండడంతో నిశ్చింతగా ఉండొచ్చు. ఈ రీజన్స్ తో ప్రస్తుతం దేశంలో ఉన్న అత్యంత సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఈ స్కీమ్స్ మొదటి వరసలో ఉన్నాయి.

వడ్డీ రేటు – లాక్ ఇన్ పీరియడ్- అర్హత- ప్రయోజనాలు

1.సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్- 8.2% వడ్డీ రేటు – 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ – 60+ వ్యక్తులు అర్హులు, అధిక రాబడి, గరిష్టంగా రూ. 30 లక్షల పెట్టుబడికి అనుమతి
2.సుకన్య సమృద్ధి యోజన (SSY) – 8.2% వడ్డీ రేటు – 21 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ – పదేళ్ల లోపు ఆడపిల్లలు అర్హులు, అత్యధిక వడ్డీ, పన్ను రహిత మెచ్యూరిటీ, EEE పన్ను ప్రయోజనాలు
3.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) – 7.7% వడ్డీ రేటు – 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ – అందరూ అర్హులే, స్థిరమైన రాబడి, 80C పన్ను ప్రయోజనం
4.కిసాన్ వికాస్ పత్ర్ (KVP) – 7.5% వడ్డీ రేటు- 115 నెలలు లాక్ ఇన్ పీరియడ్ – అందరూ అర్హులే, సేఫ్ ఇన్వెస్ట్మెంట్, స్థిరమైన రాబడి
5.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (5 ఏళ్ల టైమ్ డిపాజిట్)- 7.5% వడ్డీ రేటు – 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్- అన్ని వయసుల వారు అర్హులు, FD లాంటి సెక్యూరిటీ, పన్ను మినహాయింపు
6.పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ – 7.4% వడ్డీ రేటు- 5 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ – వ్యక్తులందరూ అర్హులు, నెలవారీ ఆదాయ ప్రయోజనాలు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) – 7.1% వడ్డీ రేటు – 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ – వ్యక్తులందరూ అర్హులు, EEE పన్ను ప్రయోజనం, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్

Advertisement

Also Read:మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు.. తెలుసుకోవాల్సిన విషయాలివే

Related News

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

నెలకు రూ.15,000 జీతం వచ్చే వారు కూడా లక్షాధికారి ఎలా అవ్వచ్చు? 50-30-20 రూల్ అంటే ఏంటి?

Big Stories

Advertisement
×