E-Paper
Advertisement

ROCK SALT: రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే మీ సంపద  రెట్టింపు అవుతుందట

ROCK SALT: రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే మీ సంపద  రెట్టింపు అవుతుందట
Advertisement

ROCK SALT: రాళ్ల ఉప్పుతో మీ సంపద రెట్టింపు చేసుకోవాలని ఉందా..? రాళ్ల ఉప్పు చిన్నదైనా దీని వల్ల చేసే రెమెడీలు చిన్నవైనా ఫలితాలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. సంపద రెట్టింపు చేసుకోవడమే కాకుండా మానసికమైన ప్రశాంతత కోసం కూడా రాళ్ల ఉప్పు పరిహారం చాలా అద్బుతంగా పని చేస్తుందని సూచిస్తున్నారు. అయితే రాళ్ల ఉప్పుతో పరిహారాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

బీరువాలో పెడితే: 

ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారికి రాళ్ల ఉప్పు రెమెడీ ఎంతో ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు. కొద్దిగా రాళ్ల ఉప్పును తీసుకుని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి బీరువాలో ఎక్కడైతే డబ్బు పెడతారో అక్కడ ఈ రాళ్ల ఉప్పు మూటను ఉంచాలట. దీంతో వారి ఆర్థిక సమస్యలు తీరిపోవడమే కాదు.. ఆ ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుందట.  వాళ్లు చేసి వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయట.

శుక్రవారం ఉప్పు దీపం:

Advertisement

ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో… అనుకోకుండా అప్పులు చేయాల్సి వస్తుందో.. ఎంత సంపాదించినా రూపాయి మిగలకుండా ఖర్చు అవుతుందో అలాంటి వారికి రాళ్లు ఉప్పు రెమెడీ చాలా అద్బుతంగా పని చేస్తుందని పండితులు చెప్తున్నారు. అందుకోసం మీరు శుక్రవారం నాడు మీ ఇంట్లో దేవుడి దగ్గర ముఖ్యంగా అమ్మవారి ఫోటో ఉంటే అమ్మ వారి ఫోటో ముందు ఎర్రటి వస్త్రం మీద కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకుని పోసి దాని మీద దీపం వెలిగించి షోడషోపచార పూజలు చేయాలని సూచిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఇలా చేస్తుంటే.. వారికున్న ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయట. త్వరలోనే వాళ్లు కోట్లు సంపాదించే పొజిషన్‌కు వెళ్తారట.

రాళ్ల ఉప్పు కొనడం:

ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు.. ఎంత సంపాదించినా అంతా  ఖర్చైపోతున్న వారు.. ఉప్పుతో చిన్న పరిష్కారం చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు చేయాల్సిందల్లా శుక్రవారం నాడు  కిరాణ షాపుకు వెళ్లి అక్కడ రాళ్ల ఉప్పు కొని ఇంటికి తీసుకురావడమేనని సూచిస్తున్నారు పండితులు. ఇలా కొన్ని శుక్రవారాలు కంటిన్యూగా చేస్తే వారికున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయట.

స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేయడం:

Advertisement

ఎవరైనా తమ ఆర్థిక సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారో.. తమకు మానసికమైన ప్రశాంతత లేదని బాధపడుతున్నారో..? అలాంటి వారు.. తరచుగా తాము స్నానం చేసే నీళ్లల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి ఉన్న ఆర్థిక సమస్యలు తీరడమే కాకుండా… మానసికమైన ప్రశాంతత లభిస్తుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నీళ్లల్లో అదొక్కటి కలిపి స్నానం చేస్తే మీకు పట్టిన దరిద్రాలన్నీ పోతాయట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×