E-Paper
Advertisement

Bathing remedies: నీళ్లల్లో అదొక్కటి కలిపి స్నానం చేస్తే మీకు పట్టిన దరిద్రాలన్నీ పోతాయట

Bathing remedies: నీళ్లల్లో అదొక్కటి కలిపి స్నానం చేస్తే మీకు పట్టిన దరిద్రాలన్నీ పోతాయట
Advertisement

Bathing remedies: ఎవరైనా జీవితంలో తమకున్న నెగెటివ్‌ ఎనర్జీ పోయి పాజిటివ్‌ ఎనర్జీ రావాలంటే స్నానం చేసే నీళ్లల్లో ప్రతిరోజే కొన్ని వస్తువులు కలుపుకుని స్నాన చేయాలట. అలా చేస్తే వారికి జీవితంలో ఉన్న చెడు మొత్తం పోయి జీవితం హ్యాపీగా ఉంటుందట. అసలు ఏ రోజు ఎలా స్నానం  చేయాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

సోమవారం: సోమవారం మీరు స్నానం చేసే నీళ్లల్లో వేడి చేసిన పాలు కొన్ని కలుపుకుని స్నానం చేయాలట. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి ఆయుష్షు పెరుగుతుందట. అలాగే ఎన్ని టెన్షన్లు ఉన్నా.. మానసికమైన ప్రశాంతత దొరుకుతుందట.

Advertisement

మంగళవారం: మంగళవారం స్నానం చేసే నీళ్లల్లో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆగిపోయిన పనులు పూర్తవుతాయట. అలాగే మీ పనులకు ఏదైనా అడ్డంకి వస్తున్నా..?  ఆ అడ్డు అనేది తొలగిపోతుందట. ఇంకా ఆ వ్యక్తికి ఉన్న నెగెటివ్‌ ఎనర్జీ పోతుందట.

బుధవారం: బుధవారం స్నానం చేసే నీటిలో యాలకులు/ఇలాచీలు కలిపి స్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి ఉన్న చెడు అనేది పోతుందట. నెగెటివ్‌ పోవడంతో అంతా పాజిటివ్‌గా జీవితం సాగిపోతుందట. ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉన్నా తీరిపోయి సంపాదన పెరుగుతుందట. అలాగే యాలకులు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల మనస్సు ఉల్లాసంగా ఉంటుందట.

Advertisement

గురువారం:  ఎవరైనా సరే గురువారం తాము స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కలుపుకుని స్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారి మీద ఉన్న నెగెటివ్‌ ఎనర్జీ పోతుందట. వారికి గురుబలం పెరుగుతుందట. గురుబలం పెరిగితే ఆర్థికగా పురోగతి.. సామాజికంగా గౌరవం, హోదా పెరుగుతుందట. రాజకీయ నాయకులకు అయితే కోరుకున్న పదవులు లభిస్తాయట. ఒక్కమాటలో చెప్పాలంటే జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతాయట.

శుక్రవారం: ఎవరైతే తాము స్నానం చేసే నీటిలో శుక్రవారం రోజు గులాబీ నీరు కలిపి స్నానం చేస్తారో వారికి జనాకర్షణ పెరుగుతుందట. అలాగే వాళ్లను చీ కొట్టిన వారే ప్రేమగా దగ్గరవుతారట. వారి అందం కూడా రెట్టింపు అవుతుందట.

శనివారం: ఎవరైతే శనివారం స్నానం చేసే నీటిలో ఆవనేనె కలుపుకుంటారో లేదంటే ఆవనూనెతో శరీరానికి మర్దన చేసిన తర్వాత స్నానం చేస్తారో వారికి ఎన్నో రకాలైన శుభాలు జరుగుతాయట. వారికి అంత వరకు ఉన్న శనిదోషాలు అన్ని పోతాయట. చేస్తున్న పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయట. దారిద్ర్యం నశించిపోతుందట.

ఆదివారం: సూర్యుడికి ఇష్టమైన ఆదివారం ఎవరైతే తాము స్నానం చేసే నీటిలో చందనం లేదా గంగాజలం కలిపి స్నానం చేస్తారో వారికి ఆత్మ శుద్ది అవుతుందట. అలాగే వారికి జీవతంలో కోరుకున్న శుభ ఫలితాలు లభిస్తాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: వృషభ రాశికి ఈ సంవత్సరం అద్బుతమైన యోగం

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×