E-Paper
Advertisement

Boys and Girls: ఆ లక్షణాలు ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.

Boys and Girls: ఆ లక్షణాలు ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.
Advertisement

Boys and Girls: అబ్బాయిల్లో ఉండే కొన్ని లక్షణాలంటే అమ్మాయిలకు తెగ ఇష్టమట. ఆ లక్షణాలు ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు పెళ్లి చేసుకుని జీవితాంతం వారితో బతకాలనుకుంటారట. అయితే అబ్బాయిల్లో ఏ లక్షణాలుంటే అమ్మాయిలకు ఇష్టమో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

మనస్తత్వశాస్త్రం ప్రకారం మెజారిటీ అమ్మాయిలు అబ్బాయిల్లో కొన్ని క్వాలిటీ లక్షణాలు ఉంటేనే ఇష్టపడతారట. అయితే అమ్మాయిలు అబ్బాయిల్లో కోరుకునే లక్షణాలు వ్యక్తిని బట్టి మారినప్పటికీ, సాధారణంగా చాలా మంది  అమ్మాయిలు ఇష్టపడే కొన్ని ముఖ్యమైన లక్షణాలను అంచనా వేయవచ్చు అంటున్నారు మనస్తత్వశాస్త్ర నిపుణులు.

Advertisement

ఆత్మవిశ్వాసం (Confidence): అబ్బాయిల్లో అమ్మాయిలు కచ్చితంగా కోరుకునేది ఆత్మవిశ్వాసం. తన గురించి తాను స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండి, ఏ పరిస్థితిలోనైనా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. అయితే ఇది అహంకారంగా (Arrogance) మారకూడదట. తన సామర్థ్యాల మీద తనకు నమ్మకం ఉన్న అబ్బాయి ఎప్పుడూ అమ్మాయిలకు  ఆకర్షణీయంగా కనిపిస్తారట.

గౌరవం (Respect): అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చ వాటిలో ఇది అన్నింటి కంటే ముఖ్యమైనదట. అమ్మాయిలను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వ్యక్తులను, పెద్దలను, సేవకులను కూడా గౌరవించే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టమట. ముఖ్యంగా, అమ్మాయి అభిప్రాయాలకు, నిర్ణయాలకు విలువ ఇచ్చే అబ్బాయిలంటే వారికి ప్రాణమట.

Advertisement

నమ్మకస్తుడిగా ఉండటం (Trustworthiness):  నమ్మకంగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు చాలా ఇష్టపడతారట. ఏ విషయాన్నైనా దాచకుండా నిజాయితీగా చెప్పే అబ్బాయిల మీద అమ్మాయిలు త్వరగా మనసు పారేసుకుంటారట. తమకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటాడనే భరోసా ఇచ్చే అబ్బాయిలంటే అమ్మాయిలకు మహా ఇష్టమట.

మంచి హాస్య చతురత (Sense of Humor): సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉన్న అబ్బాయిలంటే కూడా అమ్మాయిలకు చాలా ఇష్టమట. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా మూడ్‌ బాగా లేనప్పుడు నవ్వించే అబ్బాయిలు అంటే అందరికీ ఇష్టమే. తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ, సరదాగా ఉండే వారికి అమ్మాయిలు చాలా ప్రాధాన్యత ఇస్తారట. ఇది వారి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందట.

బాధ్యతాయుతమైన ప్రవర్తన (Responsibility): తన కెరీర్ పట్ల కుటుంబం పట్ల భవిష్యత్తు పట్ల బాధ్యతగా ఉండే అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు ఎంతో ఆకర్షితులవుతారట. జీవితంలో ఒక లక్ష్యం కలిగి దాని కోసం ప్రయత్నిస్తున్న అబ్బాయి అదృష్టాన్ని, భద్రతను ఇచ్చే వ్యక్తిగా అమ్మాయిలకు  కనిపిస్తాడట.

ఇతరులు చెప్పేది  వినే లక్షణం (Good Listener): చాలా మంది అబ్బాయిలు తాము చెప్పడానికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ అమ్మాయిలు చెప్పే విషయాలను శ్రద్ధగా వినేవారు, వారి బాధలను అర్థం చేసుకునే వారు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట. మనం చెప్పేది వింటున్నారనే భావన వారిలో ఎంతో అనుబంధాన్ని పెంచుతుందట.

వ్యక్తిగత శుభ్రత (Personal Hygiene & Grooming): చూడటానికి నీట్‌గా అందంగా రెడీ అయిన అబ్బాయిలు అంటే కూడా అమ్మాయిలు ఇష్టపడతారట. అందమైన బట్టలు వేసుకోవడం కంటే శుభ్రంగా ఉండటం మంచి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా మాట్లాడటం వల్ల అబ్బాయిలకు అదనపు ఆకర్షణ లభిస్తుందట.

ముఖ్యంగా అమ్మాయిలు కోరుకునేది భద్రత, అనుబంధం. మీరు ఏ రూపంలో ఉన్నా, మీ ప్రవర్తనలో నిజాయితీ, ఎదుటివారి పట్ల కరుణ, గౌరవం ఉంటే సహజంగానే అమ్మాయిలు ఆ అబ్బాయిల వైపు ఆకర్షితులవుతారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: బ్రహ్మంగారి కాలజ్ఞానం – కలియుగం అప్పుడే అంతం అవుతుందట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×