E-Paper
Advertisement

EV Tyres: ఎలక్ట్రిక్ కార్లలో టైర్లు త్వరగా అరిగిపోతాయా? అసలు మ్యాటర్ ఏంటంటే?

EV Tyres: ఎలక్ట్రిక్ కార్లలో టైర్లు త్వరగా అరిగిపోతాయా? అసలు మ్యాటర్ ఏంటంటే?
Advertisement

Why Electric Cars Wear Tires Faster: ఈ రోజుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రన్నింగ్ ఖర్చు, పొల్యూషన్ ఫ్రీ డ్రైవింగ్ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఓ ముఖ్యమైన మైనస్ ఉంది. అదే,టైర్లు త్వరగా అరిగిపోవడం. ఇది చాలా మందికి తెలియదు. కానీ, ఎందుకు అలా జరుగుతుందంటే?

ఎందుకు ఈవీ కార్ల టైర్ల త్వరగా అరిగిపోతాయంటే?

ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే బరువుగా ఉంటాయి. దానికి కారణంగా పెద్ద బ్యాటరీ ప్యాక్. ఈ అదనపు బరువు నేరుగా టైర్ల మీద పడుతుంది. వాహనం ఎంత బరువుగా ఉంటే, టైర్లపై ఒత్తిడి అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా టైర్లు త్వరగా అరిగిపోతాయి. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే. ఇన్ స్టంట్ టార్క్.  పెట్రోల్ కార్లలో వేగం క్రమంగా పెరుగుతుంది. కానీ, ఎలక్ట్రిక్ కార్లలో యాక్సిలరేటర్ నొక్కగానే పూర్తి పవర్ వస్తుంది. ఈ ఒక్కసారిగా వచ్చే పవర్ టైర్లపై ఎక్కువ గ్రిప్ కు కారణం అవుతుంది. ఫలితంగా టైర్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఈ కారణంగా టైర్లు త్వరగా అరుగుతాయి.

Advertisement

యాక్సిలరేషన్ మాత్రమే కాదు, బ్రేకింగ్, మలుపులు కూడా టైర్లు అరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈవీల్లో  రీజనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ ఉంటుంది. ఇది బ్రేక్ వాడినప్పుడు శక్తిని తిరిగి బ్యాటరీలోకి పంపుతుంది. దీని వల్ల బ్రేక్ ప్యాడ్లు ఎక్కువ కాలం పని చేస్తాయి. కానీ వాహనం బరువు ఎక్కువగా ఉండటం వల్ల బ్రేక్ వేసేటప్పుడు టైర్లపై ఒత్తిడి పెరుగుతుంది. మలుపు తిరిగేటప్పుడు కూడా అదనపు బరువు వల్ల టైర్లపై ఎక్కువ ప్రెజర్ పడుతుంది. ఫలితంగా టైర్ ట్రెడ్ త్వరగా దెబ్బతింటుంది. మరోవైపు డ్రైవింగ్ స్టైల్ కూడా టైర్ల అరుగుదల మీద ప్రభావం చూపిస్తున్నాయి.  వేగంగా యాక్సిలరేట్ చేయడం, సడెన్ గా బ్రేక్ వేయడం, వేగంగా మలుపులు తిప్పడం లాంటి అలవాట్లు టైర్లను త్వరగా టైర్లు అరిగేలా చేస్తాయి.

ఈవీల కోసం ప్రత్యేక టైర్లు తయారీ!

ఈవీ కార్లలో టైర్లు త్వరగా అరుగుతున్న నేపథ్యంలో టైర్ కంపెనీలు, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా టైర్లు తయారు చేస్తున్నాయి. ఇవి బలమైన సైడ్‌ వాల్స్, ప్రత్యేక రబ్బర్ కాంపౌండ్, తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్‌ తో రానున్నాయి. టైర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్లు కూడా ఈ టైర్లను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల టైర్లు అరగకుండా ఉండాలంటే?

Advertisement

ఎలక్ట్రిక్ కార్ల టైర్లు త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే, సాఫ్ట్ డ్రైవింగ్ అంటే.. స్లోగా స్పీడ్ పెంచడం, మెల్లగా బ్రేక్ వేయడం, స్టీరింగ్‌ ను సాఫ్ట్‌ గా తిప్పడం లాంటివి చేయాలి. ఫలితంగా టైర్లు ఎక్కువ కాలం అరిగిపోకుండా ఉంటాయి. అలాగే సరైన టైర్ ప్రెజర్ మెయింటైన్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఓవరాల్ గా ఎలక్ట్రిక్ వాహనాలతో కలిగే లాభాలతో పోలిస్తే, టైర్ల అరుగుదల అనేది చిన్న మైనస్ మాత్రమే!

Read Also: ఆటోమేటిక్ vs మాన్యువల్.. రెండిటిలో ఏ కారు బెస్ట్ అంటే?

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×